Friday, July 24, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలి

రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలి

- Advertisement -

– గజ్వేల్ ఏడిఏ బాబు నాయక్..
నవతెలంగాణ – రాయపోల్
ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉండడంతో వర్షాలు కురిసే అవకాశం లేకపోవడంతో రైతులు వరి పంటలకు బదులు ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులు ముందుకు రావాలని గజ్వేల్ ఏడిఏ బాబు నాయక్ అన్నారు. శుక్రవారం రాయపోల్ మండలం మంతూర్, అనాజీపూర్, చిన్న మాసాన్ పల్లి, లింగారెడ్డిపల్లి, కొత్తపల్లి ,వీరారెడ్డిపల్లి గ్రామాల్లో ఎల్‌నినో ప్రభావంపై రైతులకు అవగాహన గ్రామసభలను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావం కారణంగా ప్రస్తుత వానాకాలంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున రైతులు నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని పంటల ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు.

అధిక నీటి అవసరం ఉండే వరి సాగుకు బదులుగా జొన్న, సజ్జ, రాగులు, మొక్కజొన్న, కంది, పెసర, మినుము, నువ్వులు, వేరుశెనగ వంటి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేస్తే తక్కువ నీటితో మెరుగైన దిగుబడులు సాధించవచ్చని వివరించారు.ప్రభుత్వం అందిస్తున్న వ్యవసాయ చెరువులు సబ్సిడీ పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వర్షపు నీటిని ఫార్మ్ పాండ్స్‌లో నిల్వ చేసుకోవడం ద్వారా అవసరమైన సమయంలో జీవనాధార నీటిపారుదల అందించి పంటలను కాపాడుకోవచ్చని తెలిపారు. దీంతో ఎల్‌నినో ప్రభావం వల్ల కలిగే నష్టాలను కొంత మేర తగ్గించవచ్చని పేర్కొన్నారు.

రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించేందుకు మూడు బృందాలుగా అధికారులు గ్రామాల్లో పర్యటించి సమావేశాలు నిర్వహించారు. ఎంపీడీఓ శ్రీనివాస్, ఏపీఓ జనార్ధన్ తమ తమ బృందాలతో కలిసి రైతులకు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ నిర్వహణ, నీటి పొదుపు చర్యలు, ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పించారు.వ్యవసాయ శాఖ సూచనలను రైతులు తప్పనిసరిగా పాటించాలని, నీటిని పొదుపుగా వినియోగిస్తూ పరిస్థితులకు అనుగుణంగా పంటల సాగు చేపట్టి ఆర్థిక నష్టాలను నివారించుకోవాలని అధికారులు సూచించారు.ఈ కార్యక్రమంలో ఏవో నరేష్, సర్పంచ్లు మున్నా,పర్వేజ్,నిర్మల,సుగుణ, శ్యామల, స్వామి, ఏఈవోలు మాధవి, స్వర్ణలత, శిరీష, ఉప సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడి టీచర్లు, ఆశా కార్యకర్తలు, వార్డు సభ్యులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -