Friday, July 24, 2026
E-PAPER
Homeఖమ్మంఅరిచేతిలో హారతితో కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు

అరిచేతిలో హారతితో కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు

- Advertisement -

– ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు
– అభిమానం చాటుకున్న మోటూరు మోహన్
నవతెలంగాణ – అశ్వారావుపేట

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పట్టణంలోని పురాతన కన్యకా పరమేశ్వరి దేవాలయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ జన్మదిన వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మోటూరు మోహన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అరి చేతి లో హారతి సమర్పిస్తూ కేటీఆర్ ఆయురారోగ్యాలతో దీర్ఘాయుష్షుతో ప్రజాసేవ కొనసాగించాలని ప్రార్థించారు.

ఈ సందర్భంగా బీఆర్ఎస్ యువ నాయకులు మాట్లాడుతూ..తెలంగాణ అభివృద్ధిలో కేటీఆర్ సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. యువతకు ఆయన స్ఫూర్తిదాయక నాయకుడని కొనియాడారు. “కేటీఆర్ అంటే ధైర్యం.. రామన్న అంటే నమ్మకం.. రామన్ననే ఒక సైన్యం.. జనహృదయ నేతకు జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం” అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నియోజకవర్గ మాజీ అధ్యక్షుడు మోటూరు మోహన్, మండల నాయకులు ఆరేపల్లి వెంకటేష్ గౌడ్ (గోవింద్), వెంకన్నబాబు, వెంకట సత్యనారాయణ (గణపతి), ఆరేపల్లి వెంకటేష్ (నాని), దాడిచర్ల ఏసుబాబు, భరత్ కుమార్, భార్గవ్, బబ్లు, శివ, పవన్, రాకేష్, హేమంత్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -