Saturday, July 25, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంవిద్యార్థుల కోసం ఖర్గే పోరాటం

విద్యార్థుల కోసం ఖర్గే పోరాటం

- Advertisement -

ఫాంహౌజ్ కే పరిమితమైన కేసీఆర్:
మహేశ్ కుమార్ గౌడ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్

పార్లమెంటులో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే విద్యార్థుల కోసం కేంద్ర ప్రభుత్వంతో పోరాడుతుంటే రాష్ట్రంలో ప్రతిపక్ష నేత కేసీఆర్ ఫాంహౌజ్ కు పరిమితమయ్యారని టీపీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ ఎద్దేవా చేశారు. శుక్రవారం హైదరాబాద్ గాంధీభవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆ పార్టీ మూసేసిన ధర్నాచౌక్ లో ధర్నా చేసే హక్కు కేటీఆర్ కు ఎక్కడిదని ప్రశ్నించారు. ఈ విషయంలో ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని కేటీఆర్‌ ‌ను డిమాండ్ చేశారు. నీట్‌ ‌పేపర్‌ ‌లీకేజీకి నిరసనగా సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ లో ర్యాలీ చేపట్టారని తెలిపారు. 20 మందికి పైగా విద్యార్థుల చావుకు కారణమైన గ్లోబరీనా సంస్థ రిపోర్టును కేటీఆర్‌ ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు. ‌తన పేరు మార్చుకున్న ఆ సంస్థ ఇప్పుడు మళ్లీ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నదని ఆరోపించారు. ఆ సంస్థకు, కేటీఆర్ కు సంబంధముందని అనుమానం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ డ్రామాలో చిక్కుకోవద్దని ఆయన విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు.
​ప్రతి ఓటు నమోదు కావాలి
ఆగస్టు 3వ తేదీతో సర్ ప్రక్రియ ముగియనున్న నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రతీ ఓటు నమోదయ్యేలా చూడాలని మహేశ్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ శ్రేణులను ఆదేశించారు. శుక్రవారం ఆయన అధ్యక్షతన జరిగిన జూమ్ సమావేశంలో ఏఐసీసీ ఇంచార్జి మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేశ్‌ మాట్లాడుతూ ఈ నెల 30వ తేదీ వరకు ఓటర్లు ‌తమ పేరు నమోదు చేయించుకునేలా వారికి అవగాహన కల్పించాలని
సూచించారు. బీఎల్ఏలు, బీఎల్ఓల సమన్వయంతో అర్హత ఉన్న ఒక్క ఓటు కూడా నష్టపోకుండా చూడాలని కోరారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, డీసీసీ అధ్యక్షులు, నియోజక వర్గ ఇంచార్జిలు ప్రతి రోజు సర్ ప్రక్రియ పురోగతిపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించాలని ఆదేశించారు.
​తేలిగ్గా తీసుకోవద్దు : మంత్రి దామోదర రాజనర్సింహ
సర్ ప్రక్రియను తేలిగ్గా తీసుకోవద్దని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సూచించారు. శుక్రవారం హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని మినిస్టర్స్‌ క్వార్టర్స్‌లో ఉమ్మడి మహబూబ్‌ ‌నగర్‌ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలతో ఆయన సమీక్షించారు. నియోజకవర్గాల వారీగా సర్ పురోగతిపై మంత్రి ఆరా తీశారు. ఆ ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందని తెలిపారు. అర్హులైన ఒక్క ఓటరు కూడా ఓటు హక్కును కోల్పోకూడదని అన్నారు. ఆ మేరకు ప్రతి నాయకుడు, కార్యకర్త బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, అనిరుధ్‌ రెడ్డి, మెఘా రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, బండ్ల కృష్ణ మోహన్‌రెడ్డి, చిక్కుడు వంశీకృష్ణ, పార్టీ సీనియర్ నాయకులు సంపత్ కుమార్, సరిత తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -