Saturday, July 25, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంనౌకపై దాడి.. భారతీయుడు మృతి

నౌకపై దాడి.. భారతీయుడు మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : నల్ల సముద్రంలో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకపై జరిగిన దాడిలో ఒక భారత పౌరుడు మరణించినట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ శుక్రవారం ధృవీకరించింది. ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన భారత ప్రభుత్వం, వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించింది.

వివరాల్లోకి వెళితే, జులై 18న ‘ఎంవీ ఒమోర్ఫీ’ అనే వాణిజ్య నౌక నల్ల సముద్రంలో ప్రయాణిస్తుండగా ఈ దాడి చోటుచేసుకుంది. రష్యా ప్రాదేశిక జలాల్లో జరిగిన ఈ ఘటన సమయంలో, నౌకలో ముగ్గురు భారతీయులతో సహా మొత్తం 10 మంది సిబ్బంది ఉన్నారు. ఈ దాడిలో ఒక భారతీయుడు ప్రాణాలు కోల్పోగా, మిగిలిన ఇద్దరు సురక్షితంగా ఉన్నారని విదేశాంగ శాఖ వెల్లడించింది. రష్యాలోని భారత రాయబార కార్యాలయం అక్కడి అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని, మృతుడి కుటుంబానికి అవసరమైన అన్ని సహాయక చర్యలను అందిస్తోందని MEA ఒక ప్రకటనలో తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -