– ఇద్దరు నిందితుల అరెస్ట్
– గంటల్లోనే కేసును ఛేదించిన ఉప్పల్ పోలీసులు
నవతెలంగాణ-ఉప్పల్
స్నేహితుల మధ్య ఏర్పడిన చిన్నపాటి మనస్పర్ధలు.. మద్యం మత్తులో మాటామాటా పెరిగి కానిస్టేబుల్ హత్యకు దారి తీసిం ది. ఈ ఘటన హైదరాబాద్ చిల కానగర్‌లో ఆదివారం రాత్రి జరిగి ంది. ఈ హత్య కేసును ఉప్పల్ పోలీసులు ఎనిమిది గంటలోనే ఛేదించి ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. ఉప్పల్ డీసీపీ సురేష్ కుమార్ సోమవారం తన కార్యాల యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఘటన వివరాలను వెల్లడించారు. చిల్కానగర్‌లోని శ్రీనివాస హైట్స్ అపార్ట్‌మెంట్ సమీప రోడ్డుపై ఓ వ్యక్తి మృతిచెందినట్టు ఆదివారం రాత్రి పోలీసులకు సమాచారం అందింది. వెంటనే పెట్రోల్ బృందం, ఎస్‌హెచ్‌ఓ ఘటనా స్థలానికి చేరుకుని మృతుడిని సుధీర్(35)గా గుర్తించారు. అతను సిటీ సెక్యూరిటీ వింగ్‌లో ఏఆర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.
సుధీర్, సంతోష్ ఇద్దరూ 7-8 ఏండ్లుగా స్నేహితులు. తరచూ కలిసి మద్యం సేవించేవారు. మూడ్రోజుల కిందట సుధీర్ తన బావ ఇంటి గృహ ప్రవేశానికి సంతోష్‌ను ఆహ్వానించాడు. ఆ సమయంలో ఫోన్ కాల్స్‌కు స్పందించకపోవడంతో ఇద్దరి మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయి. తరు వాత వాట్సప్ చాటింగ్‌లో పరస్పరం తిట్టుకోవడం, ఛాలెంజ్‌లు చేసుకు న్నారు. ఈ నేపథ్యంలో ఆదర్శ్‌నగర్ గ్రౌండ్ వద్ద కలుద్దామనుకుని ఇద్దరు అక్కడికి చేరుకున్నారు. అప్పటికే ఇద్దరూ మద్యం మత్తులో ఉన్నారు. ఈ క్రమంలో మాటామాటా పెరిగి ఘర్షణకు దారి తీయగా సంతోష్ తన కీచైన్‌లో ఉన్న చిన్న చాకుతో సుధీర్‌పై విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన సుధీర్ అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ తీవ్ర రక్త సావంతో రోడ్డుపై కుప్పకూలి మృతిచెందాడు. ఆ సమయంలో సంతోష్‌తో పాటు తరుణ్ అనే వ్యక్తీ అక్కడే ఉన్నాడు. అతను సంతోష్‌ను బైక్‌పై తీసుకెళ్లి పారిపోవడంలో సహాయం చేశాడు. అనంతరం ఇద్దరూ నాగారం ప్రాంతానికి పారిపోయేందుకు ప్రయత్నించారు. ఎస్‌ఓటీ, లా అండ్ ఆర్డర్, సీసీఎస్ పోలీస్‌లు ఆరు ప్రత్యేక బృందాలుగా గాలింపు చేపట్టి సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి హత్యకు ఉపయోగించిన చిన్న చాకు, మొబైల్ ఫోన్లు, బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు సంతోష్‌పై గతం లో మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సెక్షన్ 307 కింద కేసు ఉంది. హత్య కేసును చాకచక్యంగా ఛేదించిన ఉప్పల్ పోలీసులను డీసీపీ అభినందించి పారితోషికం అందజేశారు. సమావేశంలో అదనపు డీసీపీ వెంకటరమణ, ఎన్. నర్సింహారెడ్డి, ఏసీపీలు వెంకటరెడ్డి, అంజయ్య, ఉప్పల్ ఇన్‌స్పెక్టర్ రామలింగారెడ్డి, ఎస్‌ఐలు మాధవరెడ్డి, చిరంజీవి తదితరులు ఉన్నారు.
చిల్కానగర్‌లో కానిస్టేబుల్ దారుణ హత్య
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



