Sunday, July 26, 2026
E-PAPER
Homeతాజా వార్తలువిజయం సాధించాం

విజయం సాధించాం

- Advertisement -

హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా నటించిన ‘చెన్నై లవ్ స్టోరీఇటీవల విడుదలైంది. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రేక్షకుల ప్రశంసలతో పాటు మంచి వసూళ్లు దక్కించుకుంటోంది. ప్రీమియర్స్, వరల్డ్ వైడ్ గా తొలి రోజు వసూళ్లు కలిపి 12.3 కోట్ల రూపాయలు ఆర్జించింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ ను మేకర్స్ గ్రాండ్ గా నిర్వహించారు. డైరెక్టర్ రవి నంబూరి మాట్లాడుతూ,'తన మొదటి సినిమా బ్లాక్ బస్టర్ కావడం ఏ దర్శకుడికైనా కల నిజమైన సంతోషం కలుగుతుంది. నేనూ అలాంటి హ్యాపీనెస్ నే ఎంజాయ్ చేస్తున్నా అని అన్నారు. ‘ఇది నా లైఫ్ లో చాలా ముఖ్యమైన రోజు. అమ్మాయి ప్రేమ కథ కోణంలో సినిమాను తెరకెక్కించిన మా మేకర్స్ కు థ్యాంక్స్అని హీరోయిన్ శ్రీ గౌరి ప్రియ చెప్పారు. కో ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ, 'మా సినిమాకు ప్రేక్షకుల స్పందన చూశాక సినిమా కోసం పడిన రెండేళ్ల కష్టం మర్చిపోయాం. మా మూవీకి మహిళా ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారని ముందే ఊహించాం. మేము అనుకున్నట్లే మహిళలు మా మూవీని ఇష్టపడుతున్నారు అని అన్నారు. ”బేబిసినిమా విజయం మేకర్స్ గా మాపై బరువు బాధ్యతలు పెంచాయి, తర్వాత మేము చేసే సినిమాపై అంచనాలు పెరుగుతాయి.

అందుకే మరింత యూనివర్సల్ అప్పీల్ ఉండేలా ఈ సినిమాను నిర్మించాం. అప్పట్లో బాలచందర్, భారతీరాజా కథల్లా సాయి రాజేష్ కథల్లో డెప్త్ ఉంటుంది. పాత్రలు బలంగా ఉంటాయి. అందుకే ఆయనకు రెండు నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. హీరో కిరణ్ తో సహా మేమంతా బలంగా నమ్మి చేసిన చిత్రమిది. రవి మా నమ్మకాన్ని నిలబెట్టాడు. ఈ రోజు సంతోషంగా చెబుతున్నా మేము మరోసారి సక్సెస్ అందుకున్నాం. బయ్యర్స్, డిస్ట్రిబ్యూటర్స్ ఫోన్స్ చేసి షోస్ పెంచుతున్నాం, కలెక్షన్స్ చాలా బాగున్నాయని చెబుతున్నారు అని అన్నారు. స్టోరీ రైటర్, ప్రొడ్యూసర్ సాయి రాజేష్ మాట్లాడుతూ,’ఒక మంచి సినిమాకు నేచర్ అంతా సపోర్ట్ చేస్తుందని నేను నమ్ముతాను. ఈ సినిమా విషయంలో అది మరోసారి నా అనుభవంలో చూశానుఅని చెప్పారు. హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ,'సినిమా షూటింగ్ టైమ్ లోనే చెప్పేవాడిని ఇది మనందరికీ మంచి సినిమా అవుతుందని. ఆ మాట నిజమై ఈ రోజు ప్రేక్షకులు ఘన విజయాన్ని అందించడం సంతోషంగా ఉంది. అనంత శ్రీరామ్ గారు గుర్తుండిపోయే పాటలు రాశారు అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -