ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి క్యాతరాజు సతీష్
నవతెలంగాణ – మల్హర్ రావు
వివిధ రంగాల్లో పని చేస్తున్న హమాలీ కార్మికులకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఏఐటీయూసీ జయ శంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి క్యాత రాజు సతీష్ డిమాండ్ చేశారు. మండల కేంద్రమైన తాడిచర్లలో హమాలీ కార్మికుల సమావేశం నిర్వహించి మాట్లాడారు హమాలీ కార్మికులుగా అనేక సంవత్సరాల నుండి పని చేస్తున్నారని,వాళ్ళ విపులపై క్వింటాల కొద్దీ బరువులు మోస్తూ చాలి చాలని ఆదాయంతో కాలం వెల్లదిస్తున్నారన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలు వీరిని కార్మికులుగా గుర్తించకుండా స్వయం ఉపాధి వ్యక్తులుగా భావిస్తున్నారన్నారు.
పని చేస్తున్నప్పుడు ప్రమాదం జరిగి కాళ్ళు చేతులు విరిగి చనిపోయిన పట్టించుకునే వారే లేరన్నారు. అందుకే హమాలీ కార్మికులకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలనీ, ప్రమాదవాషత్తు మరణిస్తే రూ.10 లక్షలు ఎక్షగ్రెషియా ఇవ్వాలి,50సంవత్సరాల నిండిన హమాలీ కార్మికుల కి పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్య వర్గ సభ్యులు సోతుకు ప్రవీణ్, మండల కార్యదర్శి పన్నాల కుమారస్వామి, హమాలీ కార్మికలు రాజయ్య, సమ్మయ్య, కుర్రి రాజయ్య, జి. ఐలయ్య, సేన రవి పాల్గొన్నారు.



