Monday, July 27, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంవిహారంలో విషాదం

విహారంలో విషాదం

- Advertisement -

ఒకరిని కాపాడబోయి మరో ముగ్గురు గల్లంతు
ముగ్గురు మృతి.. మరొకరి కోసం గాలింపు
ఎస్పారెస్పీ లక్ష్మికాలువ హెడ్‌రెగ్యులేటర్ వద్ద ప్రమాదం
ఘటనా స్థలాన్ని పరిశీలించిన సీపీ

నవతెలంగాణ-ముప్కాల్
ఆదివారం సెలవు రోజు కావడంతో ఆటవిడుపు కోసం సరదాగా వెళ్లిన యువకులు.. ప్రమాదవశాత్తు నీట మునిగి మృతిచెందారు. నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ఐదుగురు యువకులు కలిసి వెళ్లగా.. మహారాష్ట్ర నుంచి వచ్చిన ఓ యువకుడు ప్రాజెక్టు వద్ద స్నానానికి దిగి గల్లంతవడంతో ఆ యువకుడిని కాపాడేందుకు వెళ్లిన ముగ్గురు నీటమునిగి గల్లంతయ్యారు. వీరిలో పోలీసులు ముగ్గురు మృతదేహాలను వెలికితీయగా.. మరొకరి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలంలోని ఎస్సారెస్పీ లక్ష్మికాలువ హెడ్ రెగ్యులేటర్ వద్ద చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ పట్టణంలోని అర్సపల్లికి చెందిన షేక్ ఖాళీమోద్దీన్ (23), ఆటోనగర్ కు చెందిన సయ్యద్ నజవాత్ (23), అజీమ్‌ఖాన్‌తో పాటు మరో ఇద్దరు యువకులు ఎస్సారెస్పీ ప్రాజెక్టును సందర్శించేందుకు ఆదివారం వెళ్లారు. అదే ప్రాజెక్టును సందర్శించేందుకు వచ్చిన మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా భోకర్ ప్రాంతానికి చెందిన ఖాజా రెహన్ (17) అనే యువకుడు ముప్కాల్ లక్ష్మీ కాలువ హెడ్ రెగ్యులేటర్ వద్ద స్నానానికి దిగి గల్లంతయ్యాడు. ఇది గమఁంచిన ఖళీమోద్దీన్, సయ్యద్ నజవాత్, అజీమ్‌ఖాన్.. రెహన్‌ను కాపాడబోయే క్రమంలో వీరు సైతం గల్లంతయ్యారు. గమనించిన స్థానికులు పోలీసుల సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. సీపీ సాయిచైతన్య అక్కడికి చేరుకుని గాలింపును పర్యవేక్షించారు. కాగా గజ ఈతగాళ్ల సహాయంతో నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ఖళీమోద్దీన్, సయ్యద్ నజవాత్‌తో పాటు మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా భోకర్ ప్రాంతానికి చెందిన ఖాజా రెహన్ మృతదేహాలను వెలికితీశారు. ఆటోనగర్ ప్రాంతానికి చెందిన అజీమ్‌ఖాన్ కోసం గాలిస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ జాన్‌రెడ్డి తెలిపారు. కాగా ఏసీపీ వెంకటేశ్వర్‌రెడ్డి, ఎస్‌ఐ కె.కిరణ్ పాల్, మెండోరా, బాల్కొండ ఎస్‌ఐలు సుహాసిని, శైలందర్ తదితరులు గాలింపును పర్యవేక్షించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -