విద్యావ్యవస్థను ప్రక్షాళన చేయాల్సిందే
పోరాటం కొనసాగిద్దాం : మెడికోస్ పిలుపు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినంత మాత్రాన సరిపోదనీ, విద్యావ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేసేంతవరకు పోరాడుదామని పలువురు మెడికోస్ పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్ లోని సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో వైద్య విద్యార్థిని వై.లహరి, డాక్టర్ నీతి, డాక్టర్ సుహాస్, డాక్టర్ నీతి మాట్లాడారు. ఢిల్లీ జంతర్ మంతర్ ఆందోళన ప్రధానంగా మూడు డిమాండ్ల కోసం సాగిందని తెలిపారు. అయితే కేంద్ర ప్రభుత్వం వ్యవస్థలో మార్పు కోసం సోనమ్ వాంగ్ చుక్ తో చర్చిస్తామని చెప్పిన మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. పరీక్షల నిర్వహణలోనే అనేక లోపాలున్నాయనీ, వాటిని సరిదిద్దకుంటే భవిష్యత్తులో మళ్లీ సమస్యలు పునరావృతమవుతాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
జేఈఈ తదితర పరీక్షలు పేపర్ లీక్ కాకుండా నిర్వహిస్తుండగా, నీట్ పరీక్షను ఎందుకు నిర్వహించడం లేదని వారు ప్రశ్నించారు. పరీక్షల నిర్వహణలో ప్రయివేటు సంస్థల జోక్యంతో లీకేజీ తదితర లోపాలు తలెత్తుతున్నాయని తెలిపారు. మెడికల్ సీట్లకు ఉన్న డిమాండ్లకు తగినట్టు సీట్లను, కాలేజీలను పెంచాలనీ, ముఖ్యంగా ప్రభుత్వ కళాశాలలు, సీట్లు పెరగాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. గతంలో తమిళనాడుకు చెందిన దళిత యువతి అనిత నీట్ బాధితురాలిగా మారి ప్రాణాలు కోల్పోయిందని గుర్తుచేశారు. చదువుకోవడానికి వచ్చామనీ, వ్యవస్థలో సంస్కరణలు అవసరమని అభిప్రాయపడ్డారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ వైద్యుల కొరత ఉందని చెప్పారు. మెడికల్ విద్యలో నాణ్యతా ప్రమాణాలను కాపాడాలని కోరారు. ఇందుకోసం పట్టు విడువకుండా పోరాడేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. కేంద్ర ప్రభుత్వం హామీని నిలబెట్టుకుంటే సరే… లేదంటే మరో పోరాటం తప్పదని హెచ్చరించారు. వైద్యవిద్యలో ప్రక్షాళన కోసం మెడికోస్ తో పాటు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలన్నారు.
బట్టీ చదువులకే పట్టం కడతారా?
పరీక్షల విధానంలో సమూల మార్పు రావాలని మానవ హక్కుల కార్యకర్త స్వేచ్ఛ అభిప్రాయపడ్డారు. నీట్ తదితర పోటీ పరీక్షలు విద్యార్థులను బట్టీ పట్టేలా ప్రోత్సహి స్తున్నాయని తెలిపారు. అదే సమయంలో గ్రామీణ, అణ గారిన వర్గాల పిల్లలను ఉన్నత విద్యకు దూరం చేస్తు న్నాయనీ, గత పదేండ్లుగా ఒత్తిడితో ఆత్మహత్యలు పెరిగాయని తెలిపారు. పర్సంటైల్ ను పరిగణనలోకి తీసు కోవడం సరి కాదని తెలిపారు. సీట్ల సంఖ్య పెంచాలనీ, అంద రికి సమాన విద్య, సమాన అవకాశాలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. థెరపిస్ట్ శ్రేయా బెనర్జీ సమావేశంలో పాల్గొన్నారు.
స్వేచ్ఛ
అందరితో చర్చించాలి
వైద్యవిద్యతో పాటు విద్యావ్యవస్థలో అవసరమైన మార్పులు తెచ్చేందుకు అన్ని వర్గాలతో చర్చించాలని సీనియర్ వైద్య నిపుణులు డాక్టర్ దాసరి ప్రసాదరావు కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. నీట్ ఉండాలా? వద్దా? ఉంటే ఏ విధంగా ఉండాలి? దానితో ఉపయోగం ఏమిటి? తదితర విషయాలపై సమాజం కూడా చర్చించాలని కోరారు. ఒక విద్యార్థి వైద్యవిద్య చేసేందుకు అర్హులా? కాదా? అనే విషయాన్ని కేవలం మూడు గంటల వ్యవధితో కూడిన పరీక్ష ద్వారా నిర్ణయిస్తారా? అని ప్రశ్నించారు. నీట్ ఆశావహులు, వారి తల్లిదండ్రులు, ఇతరులందరితో విస్తృతంగా చర్చిస్తే సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
డాక్టర్ దాసరి ప్రసాదరావు
రాజీనామాతో సరిపోదు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



