ప్రజానాట్యమండలి తెలంగాణ రాష్ట్ర
కార్యదర్శి కట్ట నరసింహ
ఏపీ రాష్ట్ర మహాసభల్లో సౌహర్ద సందేశం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రజా పోరాటాలకు ప్రజా కళలు బాసటగా నిలిచినప్పుడే ప్రజా ఉద్యమాలు విజయవంతమవుతాయని ప్రజానాట్య మండలి తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కట్ట నరసింహ పేర్కొన్నారు. ఏపీ ప్రజానాట్యమండలి 11వ రాష్ట్ర మహాసభల సందర్భంగా ఆదివారం ఆయన సౌహార్థ సందేశం ఇచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో లౌకిక ప్రజాతంత్ర ఉద్యమాలు బలపడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పాలకులు ప్రజా కళాకారులను బలహీనపరిచేందుకు ఎన్నో కుతంత్రాలు చేస్తున్నారని విమర్శించారు. ఫాసిజానికి వ్యతిరేకంగా ప్రజా సాంస్కృతిక ఉద్యమం విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. అందులో భాగంగానే తెలుగు రాష్ట్రాల్లో ప్రజానాట్యమండలి కృషి ఎంతో ఉందన్నారు. వీధి నాటకాన్ని పోరాట ఆయుధంగా మలుచుకుని ప్రజల్లో చైతన్యం నింపేందుక భవిష్యత్తులో మరింత కృషి జరగాల్సిన అవసరం ఉందని తెలిపారు. లౌకిక వాదం మతసామరస్యం ప్రజాస్వామ్య విలువలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రజా కళాకారులపై ఉందన్నారు. పాలకుల విధానాల వల్ల ప్రజలకు దినదినం సమస్యలు పెరుగుతున్నాయని, వాటి పరిష్కార మార్గాలను చూయిస్తూ ఆట పాటలతో ప్రజా సాంస్కృతిక పోరాటాన్ని నిర్మించాల్సిన అవసరముందని చెప్పారు.ఒక ప్రజా కళాకారుడు మరో 10 మంది ప్రజా కళాకారులను సిద్ధం చేసుకుని భవిష్యత్తులో నిర్వహించే సాంస్కృతిక ఉద్యమాలకు రూపకల్పన చేసుకుని ముందుకు సాగాలన్నారు. ప్రజా పాటతో విశాలమైన సాంస్కృతిక ఉద్యమంలో మనందరం భాగస్వామ్యం అవుదామని పిలుపునిచ్చారు.
ప్రజా పోరాటాలకు బాసటగా ప్రజా కళలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



