నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. నీట్ పేపర్ లీక్ కు వ్యతిరేకంగా 36 రోజులుగా విద్యార్థుల చేపట్టిన ఆందోళనల నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ శనివారం కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామా చేసిన కాసేపట్లోనే ప్రహ్లాద్ జోషికి ఈ శాఖను అప్పగించారు. ఆదివారం బాధ్యతలు స్వీకరించిన అనంతరం ప్రహ్లాద్ జోషి సోషల్ మీడియాలో స్పందించారు. ‘కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించాను. నాపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతను అప్పగించిన ప్రధాని మోడీకి కృతజ్ఞతలు. వినయంతో, కర్తవ్య నిష్టతో ఈ బాధ్యతను స్వీకరిస్తున్నాను’ అని పేర్కొన్నారు. కర్నా టకకు చెందిన ప్రహ్లాద్ జోషి ధార్వాడ్ లోక్‌సభ స్థానం నుంచి ఐదుసార్లు ఎంపీగా గెలుపొందారు. గతంలో పార్లమెంటరీ వ్యవహారాలు, బొగ్గు, గనుల శాఖల మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖ పునరుత్పాదక ఇంధన శాఖల మంత్రిగా ఉన్నారు. ఇక నుంచి విద్యా శాఖ అదనపు బాధ్యతలను కూడా నిర్వర్తించనున్నారు.
కేంద్ర విద్యాశాఖ మంత్రి గాప్రహ్లాద్ జోషి బాధ్యతల స్వీకారం
- Advertisement -
- Advertisement -


