ఎన్యూమరేషన్ పత్రాల పూరింపులో ఇక్కట్లు
కొనసాగుతున్న డిజిటలైజేషన్ ప్రక్రియ
శాశ్వత వలస, మరణించిన వారి ఓట్ల తొలగింపు
ఆగస్టు 3లోగా పూర్తి చేసేందుకు ఈసీ కసరత్తు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఎన్యూమరేషన్ ఫారాలు పూరించి ఎన్నికల సంఘం నియమించిన బూత్ లెవల్ అధికారులకు (బీఎల్‌ఓ) తిరిగివ్వకుంటే ఓటు గల్లంతు కానుంది. ఈ క్రమంలో ఎన్నికల సంఘం ఫారాల పూరింపును కొంత సడలించింది. వివరాలు నింపేందుకు ఏవైనా సమస్యలున్నట్లయితే కేవలం మూడో కాలంలో ప్రస్తుత చిరునామా రాసి ఇవ్వాలని సూచిస్తోంది. అసంపూర్తి వివరాలకు సంబంధించి ఎన్నికల సంఘం ఇచ్చే నోటీసుకు నిర్దేశించిన ఏదేని ఐడీ కార్డుతో బదులివ్వడం ద్వారా ఓటు హక్కును ఇక్కడే ఉంచుకునే అవకాశం ఉంటుంది. వివరాలను నింపలేక ఎన్యూమరేషన్ ఫారాలు పూరించి ఎన్నికల సంఘం నియమించిన బూత్ లెవల్ అధికారులకు (బీఎల్‌ఓ) తిరిగివ్వకుంటే ఓటు గల్లంతు కానుంది. ఈ క్రమంలో ఎన్నికల సంఘం ఫారాల పూరింపును కొంత సడలించింది. వివరాలు నింపేందుకు ఏవైనా సమస్యలున్నట్లయితే కేవలం మూడో కాలంలో ప్రస్తుత చిరునామా రాసి ఇవ్వాలని సూచిస్తోంది. అసంపూర్తి వివరాలకు సంబంధించి ఎన్నికల సంఘం ఇచ్చే నోటీసుకు నిర్దేశించిన ఏదేని ఐడీ కార్డుతో బదులివ్వడం ద్వారా ఓటు హక్కును ఇక్కడే ఉంచుకునే అవకాశం ఉంటుంది. వివరాలను నింపలేక ఎన్యూమరేషన్ ఫారాన్ని ఇంట్లోనే ఉంచుకుంటే మాత్రం ఓటు రద్దవుతుందనే విషయాన్ని అధికారులు గుర్తుచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓటరు నమోదు పత్రాలు నింపడానికి సహాయ పడేందుకు ఎన్నికల సంఘం కొత్తగా మరిన్ని హెల్ప్‌లైన్లను ఏర్పాటు చేసింది.
బీఎల్‌ఓల ఇక్కట్లు….
ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)లో బాగంగా పంపిణీ చేసిన ఎన్యూమరేషన్ పత్రాలను తిరిగి సేకరించేందుకు పలుచోట్ల బీఎల్‌ఓలు అవస్థలు పడుతున్నారు. చిరునామాలు మారడం, పట్టణాల్లో ఓటు హక్కు ఉన్నవారికి గ్రామాల్లోనూ ఉండడం వంటి కారణాలతో ప్రక్రియ నెమ్మదిగా సాగుతోంది. బీఎల్‌వోలు ఇంటింటికీ వెళ్లి ఆరా తీస్తున్నా, కొందరి ఓటర్ల ఆచూకీ లభించడం లేదు. రెండు ప్రాంతాల్లో ఓట్లు ఉన్నవారు పట్టణాల్లో ఓటును వదిలిం చుకోవాలని చూస్తున్నారు. ఇప్పటికే వారు స్వగ్రా మాల్లో ఎన్యూమరేషన్ పత్రాలను తీసుకున్నారు. దీంతో వారు తిరిగి బీఎల్‌ఓలకు పత్రాలను సమర్పించడం లేదు. మృతులు, శాశ్వతంగా వలస వెళ్లిన వారి ఓట్లను తొలగిస్తున్నారు. గ్రామాలను వదిలి వెళ్లిన జాబితాను ప్రత్యేకంగా తయారు చేస్తున్నారు. అందుబాటులో లేని ఇంటి ఓనర్లను ఫోన్లో సంప్రదిస్తున్నారు. కొంతమంది సమయం ఉంది కదా! అని దాట వేస్తుండగా, మరికొందరి ఫోన్లు పని చేయక పోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో పక్కింటి వారితో మాట్లాడి స్థానికంగా ఉండటం లేదని వివరాలు నమోదు చేసుకుం టున్నారు. ఆగస్టు 3తో గడువు ముగుస్తుండటంతో అధికార యంత్రాంగం పూర్తిగా సర్ ప్రక్రియపైనే దృష్టి పెట్టింది.
తేల్చుకోని డబుల్ ఓటర్లు
హైదరాబాద్‌తో పాటు రాష్ర్టంలోని ప్రధాన నగరాల్లో నివసిస్తున్న వారిలో కొంతమందికి గ్రామాల్లోనూ ఓట్లున్నాయి. అక్కడే ఉంచుకోవాలా? ఇక్కడ కొనసాగించాలా? అనే మీమాంసలో ఉన్నారు. గ్రామాల్లో భూములు, ఇండ్లు ఉన్నవారు అక్కడి జాబితాల్లోనే పేర్లు ఉంచేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు సమాచారం. వీరందరికీ నగరంలో ఎన్యూమరేషన్ ఫారాలు అందించగా తిరిగి అప్పగించాలని కోరుతున్నప్పటీ పట్టించుకోవట్లేదు. సంబంధిత బీఎల్‌వోలకు అప్పగించి ఎక్కడ నమోదు చేసుకున్నారో చెబితే ఆ విషయాన్ని ‘సర్’లో నమోదు చేస్తామని ఎన్నికల సంఘం చెబుతున్నా పట్టించుకోవడం లేదు. ఫలితంగా ఫారాల అందజేత కార్యక్రమం నగరాల్లో మందకొడిగా సాగుతోంది.
బూత్‌ల వారీగా డిజిటలైజేషన్…
రాష్ట్ర వ్యాప్తంగా బూత్‌ల వారీగా బీఎల్‌ఓలు ఓటర్లకు సంబంధించిన వివరాలను డిజిటలైజ్ చేస్తున్నారు. ప్రతి రోజు తమకందిన ఎన్యూమరేషన్ ఫారాలను నమోదు ఎన్నికల సంఘం వెబ్‌సైట్లో నమోదు చేసి వివరాలను పై అధికారులకు నివేదిస్తున్నారు. అందుబాటులో లేని, ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయిన, మృతిచెందిన వారి వివరాలను పొందుపర్చి, తొలగింపు జాబితాలో చేరుస్తున్నారు. ఓటర్లు పూరించిన ఎన్యూమరేషన్ ఫారాలను సకాలంలో తిరిగి సమర్పించకపోవడంతో డిజిటలైజేషన్ ప్రక్రియ మందకొడిగా సాగుతోంది.



