Monday, September 7, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంనేడు సారంపల్లి సంస్మరణ సభ

నేడు సారంపల్లి సంస్మరణ సభ

- Advertisement -

ముఖ్య అతిథిగా సీఎం రేవంత్‌ రెడ్డి
హాజరుకానున్న సీపీఐ (ఎం) మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌ కారత్, ఇతర పార్టీల నేతలు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌

సీపీఐ(ఎం) సీనియర్‌ ‌నాయకులు, ఏఐకేఎస్‌ ‌జాతీయ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి సంస్మరణ సభను… పార్టీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించనున్నారు. హైదరాబాద్‌‌లోని రవీంద్రభారతిలో ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ సభకు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌‌వెస్లీ అధ్యక్షత వహిస్తారు. ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారు. 
సీపీఐ(ఎం) పూర్వ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌‌ కారత్‌తోపాటు టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేశ్‌‌కుమార్‌‌గౌడ్‌, మాజీ మంత్రి జగదీష్‌‌రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, టీజేఎస్‌ అధ్యక్షులు కోదండరాం, సీపీఐ (ఎంఎల్‌) ‌మాస్‌‌లైన్‌ ‌రాష్ట కార్యదర్శి పోటు రంగారెడ్డి, సీపీఐ (ఎంఎల్‌) ‌న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి పి సూర్యం, ఎంసీపీఐ (యూ) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి, సీఎస్‌‌యూసీఐ (యూ) రాష్ట్ర కార్యదర్శి సీహెచ్‌ మురహరి, సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం, ఎస్‌ ‌వీరయ్యతోపాటు పార్టీ కార్యదర్శివర్గ సభ్యులు ప్రసంగించనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -