అభినందించిన సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ
ఎన్ఈపీ-2020 ని కూడా వెనక్కి తీసుకోవాలి
నవతెలంగాణ – ఆత్మకూర్
కేంద్ర ప్రభుత్వం పై యువత గొప్ప విజయం సాధించిందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. ఆదివారం వనపర్తి జిల్లా అమరచింత మండల కేంద్రంలోని జిఎస్ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గొప్ప విజయం సాధించిన దేశ విద్యార్థులకు, యువతకు అభినందనలు తెలిపారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనేది కేవలం మొదటి అడుగు మాత్రమేనని, ఇప్పుడు ఎన్టిఎను రద్దు చేయాలన్నారు. విద్యార్థి వ్యతిరేక, వాణిజ్యపరమైన, మతతత్వ ధోరణి కలిగిన ఎన్ఈపీ-202ని కూడా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిరసనకారులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలన్నారు. విద్యార్థులపై అమానుషంగా దాడి చేసిన పోలీసు సిబ్బంది అందరిపైనా చర్యలు తీసుకోవాలన్నారు. క్రీడలు, కళలు, సిఁమా,సంస్కృతి వంటి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ ఉద్యమానికి మద్దతుగా నిలవడం ఎంతో సంతోషకరమన్నారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు, కార్యదర్శి వర్గ సభ్యులు జబ్బార్, సీనియర్ నాయకులు ఎండీ మహమ్మద్ ,మండల కార్యదర్శి జిఎస్ గోపి, మండల కార్యదర్శి వర్గ సభ్యులు బి.వెంకటేష్, అజయ్, టీ.రాఘవేంద్ర, మండల కమిటీ సభ్యులు విష్ణు తదితరులు పాల్గొన్నారు.
కేంద్రంపై యువత గొప్ప విజయం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



