Tuesday, July 28, 2026
E-PAPER
Homeజాతీయంమధ్యప్రదేశ్ లో అన్నదాతల ఆందోళన

మధ్యప్రదేశ్ లో అన్నదాతల ఆందోళన

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: మధ్యప్రదేశ్ లో అన్నదాతలు రోడ్డెక్కారు. పెసర పంటకు వంద శాతం కనీస మద్దతు ధరను ప్రకటించాలని ఆ రాష్ట్ర సీఎం ఇంటి ముట్టడికి ర్యాలీగా తరలి వెళ్లారు. ఈ-టోకెన్ విధానాన్ని రద్దు చేయాలని, భూమి రికార్డుల ఆధారంగా ఎరువుల పంపిణీ జరగాలని డిమాండ్ చేస్తూ మంగళవారం నాడు రైతుల బృందం నర్మదాపురం నుండి భోపాల్‌కు పాదయాత్ర చేపట్టింది. ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ నివాసాన్ని ముట్టడించేందుకు చేపట్టిన నిరసనలో భాగంగా రైతులు రాష్ట్ర రాజధాని వైపు కదులుతూ నినాదాలు చేశారు. ఒబదుల్లాగంజ్ ప్రాంతం వద్ద భద్రతా సిబ్బంది పాదయాత్రను అడ్డుకునేందుకు ప్రయత్నించగా, నిరసనకారులు పోలీసు బారికేడ్లను తోసుకుంటూ ముందుకు సాగారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు రైతులు తమ ఆందోళనను కొనసాగిస్తారని ‘క్రాంతికారీ కిసాన్ మజ్దూర్ సంఘటన్’ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు అరుణ్ పటేల్ పేర్కొన్నారు.

“ఈసారి మధ్యప్రదేశ్ రైతుల ప్రధాన డిమాండ్ ఒక్కటే – అదేమిటంటే, పెసర (మూంగ్) పంట మొత్తాన్ని (100 శాతం) కనీస మద్దతు ధరకు (MSP) కొనుగోలు చేయాలి. ఈ-టోకెన్ విధానాన్ని రద్దు చేయాలి, భూమి రికార్డుల ఆధారంగా ఎరువులను పంపిణీ చేయాలి. మేము ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడించడానికి వెళ్తున్నాము. ముఖ్యమంత్రి మమ్మల్ని కలుస్తారని మాకు హామీ ఇచ్చారు, కానీ తర్వాత ఆయన ఢిల్లీకి వెళ్లారని మాకు చెప్పారు.” అని మీడియాతో మాట్లాడారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -