Wednesday, July 29, 2026
E-PAPER
Homeతాజా వార్తలుహృదయాన్ని హత్తుకునే మెలోడి

హృదయాన్ని హత్తుకునే మెలోడి

- Advertisement -

హీరో దుల్కర్ సల్మాన్ పుట్టినరోజు సందర్భంగా ‘ఆకాశంలో ఒక తార’ చిత్ర యూనిట్ మంగళవారం ఫస్ట్ సింగిల్ ‘చిట్టి చిట్టి చీమ’ను విడుదల చేసింది. జివి ప్రకాష్ కుమార్ స్వరపరిచిన ఈ పాట హృదయాన్ని హత్తుకునే మెలోడిగా, భావోద్వేగంగా సినిమాలో ఏం చెప్పాల‌నుకున్నారో ఆ పాయింట్‌ను అద్భుతంగా ప్రతిబింబిస్తుంది. హీరోయిన్ కోణంలో పాడిన ఈ పాట నక్షత్రాలను చేరాలనే ఒక మహిళ కలను, ఆమె పక్కన నిలబడి నిశ్శబ్దంగా అండగా నిలిచే వ్యక్తి ప్రేమను చూపిస్తుంది. సాంప్రదాయ ప్రేమకథలను దాటి ఒక ప్రత్యేకమైన బంధాన్ని ఈ పాట అందంగా సెలబ్రేట్ చేస్తుంది. శ్రీమణి రాసిన‌ ఈ పాటను రమ్య బెహరా ఎంతో చ‌క్క‌గా ఆలపించారు. చిట్టి చీమ చక్కెర మోసుకెళ్లడం, కొండపల్లి బొమ్మ కొండలు దాటడం, గాలికి ఎదురుగా మాత్రమే ఎగిరే గాలిపటం వంటి ఆకర్షణీయమైన ఉపమానాల ద్వారా ఈ పాట పట్టుదల, ఆశ, ప్రతి కల వెనుక ఉన్న నిశ్శబ్ద బలాన్ని అద్భుతంగా ఆవిష్క‌రించింది. ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి, శ్రుతి హాసన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. పావన్ సాదినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని లైట్‌బాక్స్ మీడియా బ్యానర్‌పై సందీప్ గున్నం, రమ్య గున్నం నిర్మిస్తున్నారు. స్వప్న సినిమా, గీతా ఆర్ట్స్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -