- Advertisement -
సిఐఎస్‌సీఈ రీజినల్ జిమ్నాస్టిక్స్ పోటీలు
నవతెలంగాణ-హైదరాబాద్ : సిఐఎస్‌సీఈ రీజినల్ లెవల్ (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్) జిమ్నాస్టిక్స్ చాంపియన్‌షిప్స్‌లో హైదరాబాద్ అమ్మాయి మాన్య జోయిస్ నాలుగు పసిడి పతకాలతో సత్తా చాటింది. హైదరాబాద్‌లో జరిగిన పోటీల్లో అండర్-14 రిథమిక్ జిమ్నాస్టిక్స్ కేటగిరీలో హూప్, బాల్, క్లబ్స్, రిబ్బన్ ఈవెంట్లలో మాన్య జాయిస్ పసిడి విన్యాసంతో ఆకట్టుకుంది. నాలుగు ఈవెంట్లలో బంగారు పతకం సాధించిన మాన్య జాయిస్ (జోయ్స్ అకాడమీ) జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైందని నిర్వాహకులు తెలిపారు.
- Advertisement -



