Wednesday, July 29, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంరాజ‌కీయ నైతిక‌త‌కు ప్ర‌తీక జైపాల్ రెడ్డి

రాజ‌కీయ నైతిక‌త‌కు ప్ర‌తీక జైపాల్ రెడ్డి

- Advertisement -

ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

రాజ‌కీయాల్లో నైతిక‌త‌కు ప్ర‌తీక‌ కేంద్ర మాజీ మంత్రి ఎస్‌.జైపాల్ రెడ్డి అని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి కొనియాడారు. కేంద్ర మాజీ మంత్రి ఎస్‌.జైపాల్ రెడ్డి వ‌ర్ధంతిని పుర‌స్క‌రించేకుని సీఎం రేవంత్ రెడ్డి ఆయ‌న చిత్ర‌ప‌టానికి పూల‌మాలలేసి నివాళుల‌ర్పించారు. విద్యార్థి నాయ‌కునిగా ప్ర‌స్థానం ప్రారంభించిన జైపాల్ రెడ్డి త‌న తుది శ్వాస వ‌ర‌కు విలువ‌లు, సిద్ధాంతాలకు క‌ట్టుబ‌డి ఉన్నారని పేర్కొన్నారు. త‌న విష‌య ప‌రిజ్ఞానం, వాగ్ధాటితో అటు ప్ర‌జ‌లు, ఇటు పార్ల‌మెంట్‌లో త‌నదైన ముద్ర వేసిన ఘ‌న‌త జైపాల్ రెడ్డిద‌ని తెలిపారు. ఆయ‌న ఆశ‌యాల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం కొన‌సాగిస్తుంద‌ని పేర్కొన్నారు. కార్య‌క్ర‌మంలో పీసీసీ అధ్య‌క్షుడు మ‌హేష్ కుమార్‌ గౌడ్‌, కాంగ్రెస్ నేత‌లు రోహిణ్ రెడ్డి, తుమ్మ‌ల యుగంధ‌ర్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -