Wednesday, July 29, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఅంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల సమస్యలు పరిష్కరించాలి

అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల సమస్యలు పరిష్కరించాలి

- Advertisement -

అంగన్వాడీ యూనియన్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్

అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీ యూనియన్ (సీఐటీయూ) డిమాండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్ లో యూనియన్ నాయకులు ఐసీడీఎస్ జాయింట్ డైరెక్టర్ మోతీని కలిసి వినతిపత్రం సమర్పించారు. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల సమస్యలపై వారు చర్చించారు. జులై వేతనం ఆగస్టు 1న చెల్లిస్తామని, ప్రీ ప్రైమరీ సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని, రిటైర్మెంట్ పెండింగ్ డబ్బుల కోసం రూ.15 కోట్లు అవసరం ఉందని ప్రభుత్వానికి ఫైల్ పంపించినట్టు మోతీ తెలిపారు. ఏప్రిల్, మే, జూన్ 3 నెలల రూమ్ రెంట్స్ 15 రోజుల్లో చెల్లిస్తామని, మినీ అంగన్వాడీ టీచర్లు 87 మందికి ఆగిపోయిన ఏరియర్స్ ను త్వరలో చెల్లిస్తామని, సీబీఈ ఈవెంట్స్, గ్యాస్ బిల్లులు త్వరలో విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. హెల్పర్ నుంచి టీచర్ గా ప్రమోట్ అయిన వారికి పెండింగ్ వేతనాలు ఏరియర్స్ చెల్లించాలని ఈ సందర్భంగా నాయకులు కోరారు. వినతిపత్రం సమర్పించిన వారిలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జయలక్ష్మి , వనపర్తి జిల్లా కార్యదర్శి కవిత, ఖమ్మం జిల్లా నాయకురాలు కోటీశ్వరీ, యాదాద్రి భువనగిరి జిల్లా స్వరూపారాణి, వాలి తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -