Wednesday, July 29, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంబుల్లెట్ ట్రైన్ కోసం అలుపెరుగని ప్రజా ఉద్యమాలు

బుల్లెట్ ట్రైన్ కోసం అలుపెరుగని ప్రజా ఉద్యమాలు

- Advertisement -

సూర్యాపేటను 
బుల్లెట్ ట్రైన్ కారిడార్‌లో చేర్చాలి
సాధన సమితి ఆధ్వర్యంలో రాస్తారోకో
నవతెలంగాణ-సూర్యాపేట

​ సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్ సాధించే వరకు అలుపెరుగకుండా ప్రజా ఉద్యమాలు చేస్తామని బుల్లెట్ ట్రైన్ సాధన సమితి కన్వీనర్ ఆరుట్ల జానకి రెడ్డి అన్నారు. అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, బుల్లెట్ ట్రైన్ సాధన సమితి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అంజనాపూరి కాలనీ వద్ద జాతీయ రహదారి 65 పై రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సూర్యాపేట ప్రధాన వాణిజ్య పట్టణమని, తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రజలకు కీలక రవాణా కేంద్రంగా నిలిచిందని చెప్పారు. గతంలో ప్రతిపాదించిన బుల్లెట్ ట్రైన్ అలైన్‌మెంట్‌లో సూర్యాపేటను చేర్చగా.. ప్రస్తుతం పరిశీలిస్తున్న మూడో అలైన్‌మెంట్‌లో తొలగించడం వల్ల జిల్లా ప్రజలకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. జిల్లాలో 20 ఏండ్లుగా రైల్వే మార్గం కోసం పోరాటాలు కొనసాగుతున్నాయని గుర్తు చేశారు. బుల్లెట్ రైన్ సాధించే వరకు దశల వారీగా ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పెద్దిరెడ్డి రాజా, తండు శ్రీనివాస్ యాదవ్, ఊర రామ్మూర్తి యాదవ్, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి, తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంట్ల ధర్మార్జున్, సీపీఐ జిల్లా నాయకులు బూర వెంకటేశ్వర్లు, మాస్ లైన్ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్, న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు గంట నాగయ్య, ఎంసీపీఐ (యూ) జిల్లా కార్యదర్శి షేక్ నజీర్, , బీజేపీ జిల్లా నాయకులు చల్ల మల్ల నరసింహ, బీఆర్ఎస్ నాయకులు సతీష్, వల్లోజు ప్రశాంత్, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -