Wednesday, July 29, 2026
E-PAPER
Homeజాతీయంమాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ కు భారీ ఊరట

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ కు భారీ ఊరట

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: బొగ్గు గనుల కేటాయింపు కేసులో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ కు భారీ ఊరట లభించింది. ప్రత్యేక కోర్టు గతంలో జారీ చేసిన సమన్ల ఉత్తర్వులను కొట్టివేస్తూ కేసును శాశ్వతంగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు రద్దు చేసింది. చీఫ్ జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జోయ్‌మల్య బాగ్చీ, జస్టిస్ వి.మోహనలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌తో పాటు ఇతరులకు విచారణ సంస్థ క్లీన్ చిట్ ఇస్తూ సమర్పించిన క్లోజర్ నివేదికలను సుప్రీంకోర్టు ఆమోదించింది. సీబీఐ దాఖలు చేసిన క్లోజర్ రిపోర్టులను తోసిపుచ్చి, ట్రయల్ కోర్టు మన్మోహన్ సింగ్‌కు సమన్లు జారీ చేయాల్సిన అవసరం లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -