నవతెలంగాణ-రామారెడ్డి
ఫారం పాండుతో అనేక లాభాలు ఉన్నాయని ఏఈఓ రాకేష్ రైతులకు సూచించారు. బుధవారం మండలంలోని ఇసన్నపల్లి గ్రామపంచాయతీ వద్ద ఏర్పాటు చేసిన గ్రామసభలో ఏఈఓ రాకేష్ మాట్లాడుతూ.. ఫారం పాండు వలన నీటి నిలువ చేసి అవసరమైనప్పుడు పంటకు వినియోగించుకోవచ్చని, వర్షాభావ సమయంలో 1,2 తడులు పంటకు నీరు అందించవచ్చని, భూగర్భ జలాలు పెరుగుటకు దోహదపడుతుందని, నువ్వులు, కూరగాయలు, కొండ తోట వంటి ప్రత్యామ్నాయ పంటలు సాగుకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. చేపల పెంపకం ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చని, పశువులకు తాగునీటి అవసరాలు తీర్చవచ్చని సూచించారు. అనంతరం రైతు బాలయ్య సాగు చేస్తున్న నిమ్మతోటను పరిశీలించారు. రైతులు వరి సాగును తగ్గించి ఉద్యానవన పంటలు, ఆరుతడి పంటలు సాగు చేయాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ లచ్చయ్య, ఉప సర్పంచ్ రమేష్, జిపిఓ స్వామి, పంచాయతీ కార్యదర్శి సత్యవతి, ఎఫ్ఏ భూమయ్య, రైతులు శ్రీనివాస్, నవీన్, బాలయ్య, లక్ష్మారెడ్డి, శంకర్, బైరయ్య తదితరులు పాల్గొన్నారు.
ఫారం పాండుతో ప్రయోజనాలు: ఏఈఓ రాకేష్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



