– ఇంచార్జి మున్సిపల్ కమిషనర్ డిఈ కి బీజేపీ కౌన్సిలర్ లు వినతి పత్రం అందజేత
నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి పట్టణంలోని పలు వార్డులలో నెలకొన్న సమస్యల గురించి, రోడ్డు, డ్రైనేజీ మరమ్మత్తులు చేయించాలని, ఆషాడం బోనాల సందర్భంగా అమ్మ వారి గుడుల వద్ద మొరమ్ పోయించాలని ఇంచార్జి మున్సిపల్ కమిషనర్ డి ఈ కి బీజేపీ కౌన్సిలర్ లు బుధవారం ఆయన చాంబర్లో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ కౌన్సిలర్ లు మాట్లాడుతూ వర్షాలు కురుస్తున్న సందర్భంగా రోడ్ల పై నడిచే పరిస్థితి లేదని, ఎక్కడికక్కడ గుంతలు ఉన్నాయని , డ్రైనేజీ లు సరిగ్గా లేనందున రోడ్లపైకి డ్రైనేజీ నీరు వస్తున్నాయని ముఖ్యంగా శివారు ప్రాంతాల్లోనీ వార్డుల్లో విపరీతమైన సమస్య ఉందని అన్నారు. సాధ్యమైనంత తొందరగా పాచ్ వర్క్ లు పూర్తి చేసి అవసరం ఉన్న చోట మొరమ్ పోయించి పట్టణ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు విన్నవించినట్లు కోరారు. బోనాల పండగ సందర్భంగా అమ్మ వారి గుడి పరిసరాలలో బురద లేకుండా మొరం పోయాలని సూచించినట్టు తెలిపారు.
రోడ్లు, డ్రైనేజీలకు మరమ్మత్తులు చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



