శోక సముద్రంలో మునిగిన రామన్నగూడెం గ్రామం
మృతదేహానికి పూలమాలలు వేసిన రాష్ట్ర జిల్లా మండల నాయకులు
పాడే పట్టిన ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్]
నవతెలంగాణ-నెల్లికుదురు
మండలంలోని రామన్నగూడెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ జిల్లా సీనియర్ నాయకుడు కాసం లక్ష్మారెడ్డి మృతి పార్టీకి తీరని లోటు అని మహబూబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్, డిసిసి అధ్యక్షురాలు భూక్య ఉమా మురళి నాయక్, మాజీ డిసిసి అధ్యక్షుడు జన్నారెడ్డి భరత్ చందర్ రెడ్డి, కేసముద్రం వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎదెళ్ల యాదవ రెడ్డి ,మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని సత్యపాల్ రెడ్డి లు అన్నారు. బుధవారం మృతి చెందిన కాసం లక్ష్మారెడ్డి భౌతిక కాయానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపే కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం పార్టీ కార్యకర్తల సమస్యపై మరియు పేద ప్రజల పక్షాన నిలబడి సేవలందించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కాసం లక్ష్మారెడ్డి మృతి చెందడం ఎంతో బాధాకరమని అన్నారు. ఆయన మృతి చెందడంతో గ్రామం శోకసముద్రం లో మునిగిపోయిందని అన్నారు. మృతి చెందిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వెంటనే హుటాహుటిన గ్రామానికి చేరుకొని ఆయనే అంతిమ క్రియలు పాడేపట్టి భావోద్వేగానికి గురయ్యారు. మృతి చెందిన కుటుంబానికి ప్రతి ఒక్కరు అండగా ఉండాలని అన్నారు ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు తన వంతు కృషి చేస్తామని తెలిపారు. కాసం లక్ష్మారెడ్డి సేవలను స్మరించుకుంటూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో గొల్లపల్లి ప్రభాకర్ గౌడ్ పెరుమాళ్ళ గుట్టయా గౌడ్ బాలాజీ నాయక్ జెల్లా వెంకటేష్ రంజిత్ రెడ్డి ఆకుతోట సతీష్ రావుల సతీష్ పట్టం శెట్టి నాగరాజు జిల్లా నాయకులు వివిధ మండలాల ముఖ్య నాయకులు, బ్లాక్ కాంగ్రెస్ నాయకులు,మండల పార్టీ నాయకులు, గ్రామపార్టీ అధ్యక్షులు ,కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.



