Wednesday, July 29, 2026
E-PAPER
Homeజాతీయంపబ్లిక్ ఎగ్జామినేషన్ బిల్లుకు లోక్ సభ ఆమోదం

పబ్లిక్ ఎగ్జామినేషన్ బిల్లుకు లోక్ సభ ఆమోదం

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: పబ్లిక్ ఎగ్జామినేషన్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు-2026ను లోక్‌సభ ఆమోదించింది. ఈ బిల్లుపై కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ క్లుప్తంగా సమాధానమిచ్చిన అనంతరం ఈ ఆమోదం లభించింది. ఈ బిల్లుపై మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైన సుదీర్ఘ చర్చ రాత్రి 11 గంటల వరకు కొనసాగింది. బుధవారం నాడు తిరిగి చర్చ ప్రారంభమైంది. ప్రస్తుతం ఉన్న మూడేళ్లకు తక్కువ కాకుండా, ఐదేళ్ల నుంచి పదేళ్ల వరకు శిక్షను పొడిగించేలా పెంచాలని ఈ బిల్లు ప్రతిపాదిస్తోంది. గరిష్ట జరిమానాను కూడా రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షలకు పెంచాలని ప్రతిపాదించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -