Wednesday, July 29, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్భూ నిర్వాసితుల ఇండ్లను పరిశీలించిన కలెక్టర్

భూ నిర్వాసితుల ఇండ్లను పరిశీలించిన కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ-మర్రిగూడ 
మండలంలోని శివన్నగూడ రిజర్వాయర్ లో భూములు కోల్పోయిన నర్సిరెడ్డిగూడెం భూ నిర్వాసితులకు మండలంలోని శివన్నగూడ గ్రామంలో రిజర్వాయర్ ముంపు గ్రామస్తులకు  ప్రభుత్వం కల్పిస్తున్న 55 ఇందిరమ్మ ఇండ్లను బుధవారం జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ పరిశీలించారు.లబ్ధిదారులతో మాట్లాడి పనుల పురోగతిని,వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఇండ్ల నిర్మాణంలో ఎలాంటి జాప్యం జరగకుండా త్వరగా పూర్తిచేసి,ఇండ్లకు ఇంటి నెంబర్లు కేటాయించాలని  అధికారులను ఆదేశించారు.ఈ సందర్భంగా నర్సిరెడ్డిగూడెం భూ నిర్వాసితులు పూర్తిస్థాయిలో ఆర్ఎన్ఆర్ ప్యాకేజీ,ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమలో ఆర్డీవో శ్రీదేవి,తాహసిల్దార్ జక్కర్తి శ్రీనివాసులు,ఎంపీడీవో జిసి మున్నయ్య,శివన్న గూడ సర్పంచ్ రాపోలు యాదగిరి,తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -