Friday, March 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జాతీయ హ్యాండ్బాల్ పోటీలకు కాటారం కోచ్ మూల వెంకటేష్ ఎంపిక

జాతీయ హ్యాండ్బాల్ పోటీలకు కాటారం కోచ్ మూల వెంకటేష్ ఎంపిక

- Advertisement -

నవతెలంగాణ – కాటారం 
హర్యానా రాష్ట్రంలోని కురుక్షేత్రంలో ఈ నెల 23 నుండి 27 వరకు జరగనున్న 54వ సీనియర్ మెన్ జాతీయ స్థాయి హ్యాండ్బాల్ పోటీలకు రిఫరీగా కాటారం ట్రైబల్ వెల్ఫేర్ హ్యాండ్బాల్ అకాడమీ కోచ్ మూల వెంకటేష్ ఎంపిక కావడం విశేషం.

తెలంగాణ హ్యాండ్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్యామల పవన్ కుమార్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా హ్యాండ్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బసరవేణి లక్ష్మణ్ ఈ విషయాన్ని తెలియజేశారు. రాష్ట్రం నుంచి వెంకటేష్ ఎంపిక కావడం క్రీడా రంగానికి గర్వకారణమని వారు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ఆసనాడ మాధవి, సీనియర్ వైస్ ప్రిన్సిపాల్ ఎం. వెంకటయ్య, జూనియర్ వైస్ ప్రిన్సిపాల్ బలరాం, పీడీ కుడిమేత మహేందర్, పీఈటీ మంతెన శ్రీనివాస్ మరియు ఉపాధ్యాయులు వెంకటేష్‌ను అభినందించారు. ఆయన మరింత ఉన్నత స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -