Sunday, July 26, 2026
E-PAPER
Homeజిల్లాలునేటికి పురిగుడిసెల్లోనే దళితులు

నేటికి పురిగుడిసెల్లోనే దళితులు

- Advertisement -
  • AIAWU రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం. అడివయ్య

నవతెలంగాణ-హైదరాబాద్: తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం (AIAWU) హవెలి ఘనపూర్ మండల కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం AIAWU ప్రతినిధి బృందం హవెలి ఘనపూర్ మండల కేంద్రంలోని దళిత వాడను సర్వే నిర్వహించారు. దళితులను కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్బంగా AIAWU రాష్ట్ర కమిటీ సభ్యులు యం అడివయ్య మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్ర్యo వచ్చి 80 ఏండ్లు అవుతున్న హవెలి ఘనపూర్ మండల కేంద్రంలోని దళితులు నేటికి పూరిగుడిసెల్లో నివసిస్తున్నారని అన్నారు.వర్షానికి ఇండ్లు కురుస్తున్నాయని, వాననీటిలోనే ఉండాల్సిన దుస్థితి ఏర్పడిందని అన్నారు. ఇండ్లు ఎప్పుడు కూలిపోతాయోనేనే భయంతో దళితులు బిక్కుబిక్కుమంటూ ఇండ్లలో నివసిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

సొంత ఇల్లు లేకుండా, పూరి గుడిసెల్లో నివాసం ఉంటున్న వారికి వెంటనే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. దళితులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయితే 6 లక్షల రూపాయలు ఇస్తామని ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారని కానీ ఇప్పటి వరకు మంజూరు అయినా వారికి 5 లక్షలు మాత్రమే ఇస్తున్నారని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం దళిత, గిరిజనులకు 6 లక్షలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

దళిత వాడలో విద్యుత్ ద్విపలు లేక రాత్రి సమయంలో నడవడానికి ఇబ్బంది పడుతున్నారని, వెంటనే విద్యుత్ ద్విపలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.దళిత వాడలో LED లైట్స్ ఉన్నప్పటికీ పని చేయడం లేదని అన్నారు. రోడ్లకు ఇరువైపులా పిచ్చిమొక్కలు పెరిగిపోయినాయని వాటిని తొలగించాలని డిమాండ్ చేశారు. పిచ్చిమొక్కల వలన దోమల బెడదా పెరిగిందని, ఫాగింగ్ చేయాలని డిమాండ్ చేశారు. దళిత వాడలో ఉన్న వృద్ధులు, వితంతువులలకు పెన్షన్స్ రావడం లేదని దరఖాస్తూ చేసి 4 ఏండ్లు అవుతున్న ఎందుకు పెన్షన్స్ మంజూరు చేయడం లేదని అన్నారు. కొద్దీ మంది దళిత రైతులకు రైతు బంధు రాలేదని అన్నారు. 31 మందికి ఇండ్ల స్థలాల కోసం పట్టాలు ఇచ్చారని,వారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చెయాలనీ డిమాండ్ చేశారు.

ఉపాధి లేక పోవడంవలన కుటుంబ పోషణ కోసం వడ్డీ వ్యాపారులను అశ్రాయించాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. డ్వాక్రా గ్రూప్లో ఉన్న వారికి పావలా వడ్డీ రావడం లేదని అన్నారు.చదువుకున్న అనేక మంది దళిత యువకులు ఉన్నారని వారికి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి రుణాలు రావడం లేదని అన్నారు. రాజీవ్ యువ వికాసం కోసం దరఖాస్తూ చేసిన వారికి నేటికీ రుణాలు రాలేదని ఆరోపించారు. 21 మంది దళితులకు అసైన్మెంట్ భూములు ఇచ్చారని వాటిని అభివృద్ధి చేయడానికి ఎస్సి కార్పొరేషన్ నుండి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రానికి కుతవేటు దూరంలో ఉన్న మండల కేంద్రమైన హవెలి ఘనపూర్ మండల కేంద్రంలోని దళితులకు దేవాలయ ప్రవేశం లేదని అన్నారు.దళితులు గుడి ఎక్కకుంటే అధికారులు ఎందుకు చొరవ చూపడం లేదన్నారు. పౌరహక్కుల దినాన్ని మండల కేంద్రంలో వెంటనే జరపాలని డిమాండ్ చేశారు.దళిత వాడలో సమస్యలు విలయతాండవం చేస్తున్న పంచాయతీ కార్యదర్శి దళిత వాడను పట్టించుకోవడం లేదని అన్నారు. దళిత వాడలో సమస్యలు పరిష్కారం చేయని పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.దళిత వాడలో సమస్యలు పరిష్కారం కోసం ఉద్యమం చేస్తామని హేచ్చరించారు. ఈ కార్యక్రమంలో AIAIWU జిల్లా కార్యదర్శి కె.మల్లేశం జిల్లా ఉపాధ్యక్షులు కె. కవిత, హవెలి ఘనపూర్ గ్రామ నాయకులు లావణ్య, కిష్టయ్య, సరళ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -