Sunday, September 6, 2026
E-PAPER
Homeఖమ్మంరిటైర్డ్ హెచ్‌ఎం కుమారుడు సురేంద్ర నాథ్ మృతి

రిటైర్డ్ హెచ్‌ఎం కుమారుడు సురేంద్ర నాథ్ మృతి

- Advertisement -

– పార్థివదేహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే రాగమయి దయానంద్ 
నవతెలంగాణ-సత్తుపల్లి 

సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలోని గుడిపాడు రోడ్డులో నివాసముంటున్న రిటైర్డ్ ప్రధానోపాధ్యాయురాలు వీర్ల (దార్ల) సరోజిని  కుమారుడు సురేంద్రనాథ్ (40) అకాల మరణం చెందారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ వారి నివాసానికి వెళ్లి, సురేంద్రనాథ్ పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మృతుని పవిత్రాత్మకు శాంతి చేకూరాలని దేవుని ప్రార్థించారు. శోకసంద్రంలో ఉన్న కుటుంబ సభ్యులకు తన గాఢ సానుభూతిని తెలిపారు. ​ఎమ్మెల్యే రాగమయి దయానంద్‌తో పాటు మున్సిపల్ చైర్‌పర్సన్ మొహమ్మద్ రెహానా కమల్, ఏఎంసీ చైర్మన్ దోమ ఆనంద్ బాబు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గాదె చెన్నారావు, మున్సిపల్ కౌన్సిలర్ తోట సుజలరాణి, కో-ఆప్షన్ సభ్యుడు ఫయాజ్ అలీ, నాయకులు దొడ్డా శ్రీనివాసరావు, గుండు ఉమామహేశ్వరరావు పాల్గొని నివాళులర్పించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -