నవతెలంగాణ-నవాబుపేట
మండల పరిధిలోని కాకరజాల గ్రామ సమీపంలో ఉన్న నిర్మల ఆంజనేయస్వామి వార్షికోత్సవ ఉత్సవాల సందర్భంగా గ్రామ సర్పంచ్ మధుసూదనరాజు శర్మ , తండా సర్పంచ్ గ్రామ పెద్దల సమక్షంలో పెరుమాళ్ళ ఆంజనేయ స్వామికి ప్రజలు భక్తిశ్రద్ధలతో ఘనంగా పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఏడాది శ్రావణమాసంలో చివరి శనివారంలో జరిగే ఉత్సవాలు తాండ, గ్రామ ప్రజలు ఘనంగా నిర్వహిస్తారని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుంటారని అన్నారు. దీంతోపాటు ఆలయ ప్రాంగణంలో యువకులు పాటల పాటలతో ఆనందోత్సాహాలతో సాంప్రదాయ ఆచారాలతో భక్తి కార్యక్రమాలు పండుగలా జరుపుకున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న ఈ ఉత్సవాలు ఆధ్యాత్మిక సాంస్కృతిక ఐక్యతకు ప్రతికగా నిలుస్తున్నాయని తెలిపారు.
వైభవంగా పెరుమాళ్ళ ఆంజనేయ స్వామి మహోత్సవం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



