చిన్ననాటి స్నేహితులు..
29 ఏళ్ల తర్వాత ఒక్కచోట చేరి ఆత్మీయంగా పలకరించుకున్న వైనం
నవతెలంగాణ – కామారెడ్డి
1996–97 విద్యా సంవత్సరంలో 7వ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం సోమవారం ఘనంగా నిర్వహించారు. లింగంపేట్ మండలంలోని నల్లమడుగు గ్రామ పాఠశాలలో ఏడవ తరగతి చదువుకున్న విద్యార్థిని విద్యార్థులు 29 ఏళ్ల తర్వాత ఒకరినొకరు కలుసుకున్న పూర్వ విద్యార్థులు చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఆనందంగా గడిపారు. ఈ సందర్భంగా అప్పటి విద్యార్థులు, ఉపాధ్యాయులు పరస్పరం ఆత్మీయంగా పలకరించుకొని తమ విద్యాభ్యాసం, అప్పటి అనుభవాలను గుర్తుచేసుకున్నారు. అనంతరం వివిధ రంగాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులను ఘనంగా సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. ప్రస్తుతం ఎవరెవరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో తెలుసుకుని సైతం ఆనందాన్ని వ్యక్తం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ స్నేహబంధాన్ని మరోసారి చాటుకున్నారు. 29 ఏళ్ల అనంతరం జరిగిన ఈ అపూర్వ సమ్మేళనం అందరిలో ఆనందాన్ని నింపింది.
పూర్వ 7వ తరగతి విద్యార్థుల అపూర్వ సమ్మేళనం
- Advertisement -
- Advertisement -



