-పోతారంలో -చికిత్స నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వాస్పత్రికి తరలింపు
నవతెలంగాణ-బెజ్జంకి
మనస్థాపానికి గురై గడ్డిమందు తాగి వ్యక్తి ఆత్మహత్యయత్నానికి పాల్పడిన సంఘటన మండల పరిధిలోని పోతారం గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది.నిషాని వెంకటేశ్ బెజ్జంకి మండల కేంద్రంలోని ఓ పాల ఉత్పత్తి కేంద్రంలో పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.స్థానిక యువకుడు తన పోన్ తీసుకువచ్చాడని వెంకటేశ్ ఇంటికి వెళ్లి అడగడంతో పోలం వద్ద గడ్డిమందు పిచికారీ చేస్తానని చెప్పి వెళ్లిపోయి మనస్థాపానికి గురై గడ్డిమందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడని స్థానికులు తెలిపారు.గమనించిన స్థానికులు బెజ్జంకి 108 అంబులెన్స్ కు సమాచారం అందించారు.అంబులెన్స్ సిబ్బంది పర్శయ్య,రాజమల్లు బాధితుడికి మేరుగైన చికిత్స నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు.బాధితుడి ఆరోగ్య పరిస్థితి వివరాలు తెలియాల్సి ఉంది.
ద్విచక్ర వాహనదారుడికి తీవ్ర గాయాలు..
మండల కేంద్ర శివారులోని ఎస్సీ బాలుర వసతి గృహం వద్ద రోడ్ఠు ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు తీవ్ర గాయాలపాలయ్యాడు.వడ్లూర్ గ్రామానికి చెందిన జక్కని సత్యనారాయణ తన ద్విచక్ర వాహనంపై మండల కేంద్రానికి వస్తున్నాడు.ప్రధాన రోడ్డు పక్కన నిల్వ చేసిన బండరాళ్లపై ద్విచక్ర వాహనదారుడు పడిపోయా ఉండడాన్ని వాహనదారులు గమనించి బెజ్జంకి 108 అంబులెన్స్ కు సమాచారం అందించారు.108 అంబులెన్స్ సిబ్బంది పర్శయ్య,రాజమల్లు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని బాధితుడిని చికిత్స నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.



