- Advertisement -
నవతెలంగాణ-సారంగాపూర్
పులుల సంరక్షణ అందరి బాధ్యత అని డిఎఫ్ఆర్ఓ నాగిని బాను అన్నారు. ప్రపంచ పులుల దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం మండలంలోని జామ్ గ్రామంలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పులుల సంరక్షణ, అటవీ జీవ వైవిధ్య పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం ప్రపంచ పులుల దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన వ్యాసరచన, చిత్రలేఖన పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, మెమెంటోలను అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ ఆర్ ఓ రామకృష్ణారావు, గ్రామ సర్పంచ్ కరిపే రవళి, డివైఆర్వో నజీర్ ఖాన్, ఉపాధ్యాయులు, అటవీ శాఖ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
- Advertisement -



