Wednesday, July 29, 2026
E-PAPER
Homeమానవివర్షాకాలంలో ఇలా….

వర్షాకాలంలో ఇలా….

- Advertisement -

వర్షాకాలంలో పాదాలు ఎక్కువగా నీటిలో నానుతూ ఉంటాయి. ఈ సీజన్‌లో రోడ్లపైకి బురద వచ్చి చేరుతుంది, కాళ్లకు బురద అంటుకోవడంతో పాటు.. ప్రమాదకరమైన క్రిములు సైతం మన పాదాల మీదకు చేరుకుంటాయి. ఈ కాలంలో పాదాలను రక్షించుకోవడానికి కొన్ని జాగ్రత్తలు కచ్చితంగా పాటించాలి. అవేంటో తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదివేయండి.​

క్లీన్‌గా ఉంచుకోండి..
పాదాలను శుభ్రంగా ఉంచుకోకపోతే.. ఇన్ఫెక్షన్లకు గురయ్యే ప్రమాదం ఉంది. వర్షాకాలం బయట నుంచి రాగానే.. పాదాలను లిక్విడ్ వాష్‌తో శుభ్రం చేసుకోవాలి. లేకపోతే.. నీటితో శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత పాదాలను బాగా పొడిగా తుడుచుకొని వేళ్ల మధ్యలో యాంటీ ఫంగల్ పౌడర్ చల్లుకోవాలి. అలాగే కాలిగోళ్లు ఎప్పటికప్పుడు కత్తిరించుకోవాలి. లేదంటే వాటిలో మురికి చేరి దురదలు, ఇతర చర్మ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది.

​చెప్పులు ఇలా..
వర్షాకాలంలో వేసుకొనే చెప్పుల విషయంలో జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఈ సీజన్లో షూస్‌ వేసుకోకపోవడమే మంచిది. లేదా రోడ్డుపై నడుస్తున్నప్పుడు వీటిలోకి నీరు చేరే అవకాశం ఉంది. ఈ నీటిలో పాదాలు ఎక్కువ సమయం ఉండిపోవడం వల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. వాటికి బదులు పాదాలకు గాలి తగిలేలా ఉండే ఫుట్‌వేర్ ఎంచుకోవడం మంచిది.

స్క్రబ్‌ కచ్చితంగా..
వర్షాకాలంలో పాదాలను రోజూ స్క్రబ్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. గోరువెచ్చని నీటిలో కొద్దిగా షాంపూ వేసుకుని, దీనిలో పాదాలను పది నిమిషాల పాటు ఉంచాలి. ఆ తర్వాత ఫుట్ స్క్రబ్‌తో శుభ్రం చేసుకోవాలి. అలాగే రోజూ ప్యుమిస్ స్టోన్‌ని ఉపయోగించి పాదాలను క్లీన్‌ చేసుకోండి.​

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -