Tuesday, July 28, 2026
E-PAPER
Homeమానవివీటితో ఎన్నో ప్రయోజనాలు…

వీటితో ఎన్నో ప్రయోజనాలు…

- Advertisement -

మిరియాలు. ప్రతీ ఇంటా ఖచ్చితంగా ఉంటాయి. ఇవి రుచికే కాదు, ఆరోగ్య పరంగానూ ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. నల్ల మిరియాలను ‘బ్లాక్ గోల్డ్’ గా పిలుస్తారు. వీటిలో సి, కె విటమిన్లు, ఫైబర్, పొటాషియం, ఐరన్, మెగ్నీషియం వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. మిరియాల్లోని యాంటీ ఇన్​ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియాల్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ గుణాలు సమృద్ధిగా ఉండటంతో ఆరోగ్య పరంగా ఎన్నో ప్రయోజనాలు అందిస్తాయి. వీటిల్లోని జీర్ణరసాలు, ఎంజైమ్​ల ఉత్పత్తిని ప్రేరేపించి, ఆహారం త్వరగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. అజీర్ణం, గ్యాస్, ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందులోని పైపెరిన్ అనే క్రియాశీలక సమ్మేళనం పేగుల పనితీరును మెరుగుపరుస్తుంది. ఇందులోని ప్రధాన ఆల్కలాయిడ్ భాగం పైపెరిన్ అభిజ్ఞా మెదడు పనితీరులో సహాయపడతుంది. మిరియాలలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. మిరియాలు శ్లేష్మాన్ని తగ్గించడంలో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. మిరియాలు శరీరంలో మెటబాలిజంను పెంచి, కొవ్వును వేగంగా కరిగించడంలో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు.
నల్లమిరియాలు బరువు తగ్గడంలో సహాయపడతాయని, అంతేకాకుండా సైనస్, ఉబ్బసం, నాసికా రద్దీని నయం చేస్తుందని, ఇది క్యాన్సర్, గుండె, కాలేయ వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందని ప్రముఖ జర్నల్​ ప్రచురించింది. మిరియాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -