Thursday, July 30, 2026
E-PAPER
Homeఆటలువన్డేల్లో టాప్‌ ‌లో గిల్

వన్డేల్లో టాప్‌ ‌లో గిల్

- Advertisement -

దుబాయ్‌: అంతర్జాతీయ క్రికెట్‌ ‌మండలి(ఐసీసీ) ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్‌‌లో టీమిండియా కెప్టెన్‌ ‌శుభ్‌‌మన్‌ ‌గిల్‌ వన్డేల్లో అగ్రస్థానంలో నిలువగా.. టి20 ర్యాంకింగ్స్‌‌లో 15ఏళ్ల వైభవ్‌ ‌సూర్యవంశీ ఏకంగా 230స్థానాలు ఎగబాకి 48వ స్థానంలో నిలిచాడు. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేసిన గిల్(801).. న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్‌(794)ను వెనక్కి నెట్టి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. మూడు, నాలుగు స్థానాల్లో విరాట్ కోహ్లీ(767), రోహిత్ శర్మ(758) కొనసాగుతున్నారు. ఇక యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టీ20 ర్యాంకింగ్స్ జాబితాలో అదరగొట్టాడు. జింబాబ్వేపై వరుసగా రెండు అర్ధ సెంచరీలు చేసి చరిత్ర సృష్టించిన వైభవ్‌.. టి20 ర్యాంకింగ్స్ జాబితాలో ఏకంగా 230 స్థానాలు ఎగబాకి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -