Thursday, July 30, 2026
E-PAPER
Homeబీజినెస్ఎన్‌‌టీపీసీ రూ.17 లక్షల కోట్ల పెట్టుబడులు

ఎన్‌‌టీపీసీ రూ.17 లక్షల కోట్ల పెట్టుబడులు

- Advertisement -

వచ్చే పదేళ్లకు ప్రణాళికలు
మూడు రెట్ల విద్యుత్‌ ఉత్పత్తి లక్ష్యం
న్యూఢిల్లీ :
దేశంలోని అతిపెద్ద విద్యుత్ ఉత్పాదక సంస్థ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌‌టీపీసీ) భవిష్యత్ అవసరాల కోసం భారీ ప్రణాళికలు సిద్దం చేసింది. దీర్ఘకాలిక వృద్ధి వ్యూహంలో భాగంగా 2037 ఆర్థిక సంవత్సరం నాటికి సుమారు రూ.17 లక్షల కోట్ల భారీ మూలధన వ్యయం చేయాలని నిర్ణయించింది. దీంతో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని దాదాపు మూడు రెట్లు పెంచుకోవాలని ఈ ప్రభుత్వ రంగ సంస్థ లక్ష్యంగా చేసుకుంది. వార్షిక జనరల్‌బాడీ ‌సమావేశంలో ఈ విషయాలను ఇన్వెస్టర్లకు వెల్లడించింది.ప్రస్తుతం ఎన్‌‌టీపీసీ గ్రూప్ ఉత్పత్తి పోర్ట్‌ఫోలియో సామర్థ్యం 127 గిగావాట్లుగా ఉండగా.. ఇందులో దాదాపు 91 గిగావాట్లు ఆపరేషనల్ సామర్థ్యం కాగా మరో 36 గిగా వాట్ల పనులు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. దీన్ని రాబోయే దశాబ్ద కాలంలో భారీగా విస్తరించాలని సంస్థ భావిస్తోంది. ఇందులో భాగంగా 2032 నాటికి విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 150 గిగావాట్లకు, 2037 నాటికి ఏకంగా 250 గిగావాట్లకు పెంచడమే లక్ష్యంగా అడు గులు వేస్తున్నట్లు ఎన్‌‌టీపీసీ తెలిపింది. భవిష్యత్ విద్యుత్ వృద్ధిలో పునరుత్పాదక ఇంధన వనరులదే కీలక పాత్ర ఉండనుందని సంస్థ స్పష్టం చేసింది. ప్రస్తు తం సుమారు 12 గిగావాట్లుగా ఉన్న గ్రీన్ ఎనర్జీ ఆప రేషనల్ సామ ర్థ్యాన్ని 2032 నాటికి 60 గిగావాట్లకు, 2037 నాటికి 136 గిగావాట్లకు విస్తరించనున్నట్లు పేర్కొంది. దీనికి తోడు బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులతో పాటు అణు విద్యుత్ రంగానికి కూడా పెద్దపీట వేయనున్నట్లు వెల్లడించింది. దీర్ఘకాలిక ఇంధన భద్రత కోసం థర్మల్, పునరుత్పాదక, అణు విద్యుత్ రంగాలు కీలకం కానున్నాయని ఎన్‌‌టిపిసి తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -