Thursday, July 30, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రజల సౌకర్యార్థం నూతన ట్రాఫిక్ అవుట్‌పోస్ట్‌

ప్రజల సౌకర్యార్థం నూతన ట్రాఫిక్ అవుట్‌పోస్ట్‌

- Advertisement -

– నూతన ట్రాఫిక్ అవుట్‌పోస్ట్‌ను ప్రారంభించిన సిపి 
– సిద్దిపేట సిపి పీ.రష్మీ పెరుమాళ్
నవతెలంగాణ-హుస్నాబాద్ రూరల్ 

హుస్నాబాద్ పట్టణంలో ట్రాఫిక్ ఇబ్బందులను నివారించడానికి, ప్రజల సౌకర్యార్థం ఈ నూతన ట్రాఫిక్ అవుట్‌పోస్ట్‌ను ఏర్పాటు చేసినట్లు సిద్దిపేట సిపి పీ రష్మీ పెరుమాళ్ అన్నారు. గురువారం హుస్నాబాద్‌ పోలీస్ స్టేషన్ లో నూతన ట్రాఫిక్ అవుట్‌పోస్ట్‌ను సిద్దిపేట సిపి రష్మీ పెరుమాళ్  ప్రారంభించారు. అనంతరం, పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సీపీ రష్మీ పెరుమాళ్ మాట్లాడుతూ.. ఈ అవుట్‌పోస్ట్ ఇప్పటికే అందుబాటులోకి వచ్చి విధులు నిర్వహిస్తోందని పేర్కొన్నారు.

గతంలో ట్రాఫిక్ విభాగం కొరకు ప్రత్యేక స్థలం లేకపోవడం వల్ల కొంత ఇబ్బంది ఉండేదని, ఇప్పుడు పూర్తిస్థాయిలో అవుట్‌పోస్ట్‌ అందుబాటులోకి వచ్చిందన్నారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణను మరింత బలోపేతం చేసేందుకు ఇక్కడికి అదనపు సిబ్బందిని కూడా త్వరలోనే కేటాయిస్తామని సీపీ స్పష్టం చేశారు. పట్టణ ప్రజలు, వాహనదారులు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రోడ్డు భద్రతా ప్రమాణాలు మరియు ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని సీపీ విజ్ఞప్తి చేశారు. ట్రాఫిక్ రూల్స్ ఖచ్చితంగా అనుసరించాలని, ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే వారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు.  ఈ కార్యక్రమంలో అదనపు డిసిపి అడ్మిన్ కుశాల్కర్, హుస్నాబాద్ ఏసిపి సదానందం, హుస్నాబాద్ సీఐ శ్రీధర్ , చేర్యాల సీఐ రమేష్, ట్రాఫిక్ ఎస్ఐ వెంకటేశ్వర్ రెడ్డి, డివిజన్ పీఎస్ ఎస్ఐలు లక్ష్మారెడ్డి, అభిలాష్, మహేష్, ప్రశాంత్, మరియు సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -