Thursday, July 30, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బాధితుల ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి 

బాధితుల ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి 

- Advertisement -

– ఏసీపీ కార్యాలయాన్ని తనిఖీ చేసిన సీపీ రష్మీ పెరుమాళ్
నవతెలంగాణ-హుస్నాబాద్ రూరల్ 

బాధితుల నుంచి వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించి వాటికి త్వరగా పరిష్కారం లభించేలా చొరవ చూపాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాళ్ స్పష్టం చేశారు. వార్షిక తనిఖీల్లో భాగంగా  గురువారం హుస్నాబాద్ ఏసీపీ కార్యాలయాన్ని సిద్దిపేట సిపి రష్మీ పెరుమాళ్ తనిఖీ చేశారు. కార్యాలయానికి చేరుకున్న కమిషనర్‌కు పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం ఆమె కార్యాలయ ఆవరణలో పర్యావరణ పరిరక్షణను కాంక్షిస్తూ ఒక మొక్కను నాటారు. ఈ సందర్భంగా సీపీ రష్మీ పెరుమాళ్ కార్యాలయ పరిసరాలను పరిశీలించి, పోలీస్ స్టేషన్‌లోని అన్ని రకాల రికార్డులను మరియు ప్రస్తుతం దర్యాప్తులో ఉన్న కేసుల వివరాలను నిశితంగా తనిఖీ చేశారు.

అనంతరం ఏసీపీ సదానందంకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎస్సీ, ఎస్టీ, పోక్సో మరియు ఇతర గ్రేవ్ కేసుల దర్యాప్తును నిర్ణీత కాలపరిమితిలోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. కార్యాలయానికి సంబంధించిన అన్ని రికార్డులను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ, పారదర్శకంగా ఉంచాలని ఆదేశించారు. కార్యాలయానికి వచ్చే ప్రతి ఫిర్యాదుదారుడితో ఓపికగా మాట్లాడి, వారి సమస్యలను వినాలని అధికారులకు సూచించారు. . సిద్దిపేట సురక్ష నేత్ర కార్యక్రమంలో భాగంగా డివిజన్లోని అన్ని గ్రామాలలో సీసీటీవీ కెమెరాలను అమర్చేలా అవగాహన కల్పించాలని సూచించారు. సిద్దిపేట పోలీస్ ఉద్యోగమిత్ర పోర్టల్ గురించి అన్ని గ్రామాలలో యువతకు సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. ఈ తనిఖీ కార్యక్రమంలో హుస్నాబాద్ ఏసీపీ సదానందంతో పాటు హుస్నాబాద్ సీఐ శ్రీధర్, చేర్యాల సీఐ రమేష్, ఎస్ఐలు మహేష్, లక్ష్మారెడ్డి, ప్రశాంత్, అభిలాష్ పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -