Thursday, July 30, 2026
E-PAPER
Homeక్రైమ్​ప్రయివేట్ బస్సు లగేజ్ డోర్ తగిలి పశువుల కాపరి దుర్మరణం

​ప్రయివేట్ బస్సు లగేజ్ డోర్ తగిలి పశువుల కాపరి దుర్మరణం

- Advertisement -

– బస్సు స్వాధీనం, కేసు నమోదు
నవతెలంగాణ-సత్తుపల్లి

సత్తుపల్లి మండలం రేగళ్లపాడు-బుగ్గపాడు రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కన పశువులను మేపుతున్న తురసం రాజులు (60) అనే పశువుల కాపరి ఈ ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు బుగ్గపాడు గ్రామానికి చెందిన వ్యక్తిగా స్థానికులు గుర్తించారు. పాల్వంచ నుంచి సత్తుపల్లి వైపు వెళ్తున్న ‘సుమతి’ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అతివేగంతో వచ్చి కాపరిని ఢీకొట్టింది. ​బస్సు సైడ్ లగేజ్ డోర్ తెరుచుకుని ఉండటంతో, అది నేరుగా రాజులుకి తగిలి తీవ్ర గాయాలయ్యాయి. ​లగేజ్ డోర్ తెరిచి ఉన్నా పట్టించుకోకుండా డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సు నడపడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

​సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద తీరును పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ప్రమాదానికి కారణమైన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును పోలీసులు స్వాధీనం చేసుకుని స్టేషన్‌కు తరలించారు. ​ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -