– ఎజెండాలో చేర్చిన 21 అంశాలు ఆమోదం
– నలుగురు కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక
నవతెలంగాణ-సత్తుపల్లి
సత్తుపల్లి మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం బుధవారం చైర్ పర్సన్ మొహమ్మద్ రెహానా కమల్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఎజెండాలో చేర్చిన 21 అంశాలను ఆమోదించడంతోపాటు నలుగురు కో-ఆప్షన్ సభ్యులను ఎన్నుకున్నారు.
21 అంశాలకు ఆమోదం
పట్టణాభివృద్ధి, ప్రజారోగ్యం, సంక్షేమానికి సంబంధించి కౌన్సిల్ ముందు ప్రవేశపెట్టిన మొత్తం 21 ఎజెండా అంశాలను కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ఆమోదించారు.
నలుగురు కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక
అజెండా ఆమోదం అనంతరం, నిబంధనల ప్రకారం నలుగురు కో-ఆప్షన్ సభ్యుల ఎన్నికను నిర్వహించారు. అనుభవం, పరిజ్ఞాన విభాగం నుంచి డాక్టర్ కందిమళ్ల కృష్ణారావు, వేములపల్లి పుష్పలత, అల్పసంఖ్యాక వర్గాల (మైనారిటీ) విభాగం నుంచి మొహమ్మద్ ఫయాజ్ అలీ, బేతంపూడి దేవమణి ఎన్నికయ్యారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ కె. నర్సింహా మేనేజర్ మైసా శ్రీనివాసరావు, ఏఈ సురేష్, టీపీఓ కె. రాజు, టీపీఎస్ ఐ. భాస్కర్, టీపీబీఓ కిరణ్, ఆర్ఐ కె. దిలీప్ కుమార్, సీనియర్ అకౌంటెంట్ వై. సుజాత, జూనియర్ అకౌంటెంట్ షేక్ జరీనా, మెప్మా సీఓ ఆర్. వి. ప్రసాద్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.



