Thursday, July 30, 2026
E-PAPER
Homeఖమ్మంక్రీడా పోటీల్లో జేవీఆర్-ఓసీ సీహెచ్‌పీకి 'ప్రథమ' బహుమతి

క్రీడా పోటీల్లో జేవీఆర్-ఓసీ సీహెచ్‌పీకి ‘ప్రథమ’ బహుమతి

- Advertisement -

– ఘనంగా విజయోత్సవ సంబురం
నవతెలంగాణ-సత్తుపల్లి

గత ఏడాది నిర్వహించిన 56వ రక్షణ వార్షిక పక్షోత్సవాల సందర్భంగా సింగరేణి వ్యాప్తంగా క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో సీహెచ్‌పీ విభాగంలో ‘జేవీఆర్ సీహెచ్‌పీ’ ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది.  సోమవారం రామగుండం-I ఏరియాలో నిర్వహించిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో విజేతలకు ట్రోఫీతో పాటు సర్టిఫికెట్లను అందజేశారు. ఈ ఘన విజయాన్ని పురస్కరించుకుని బుధవారం జేవీఆర్ సీహెచ్‌పీ ప్రాంగణంలో విజయోత్సవ సంబరాలను ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏరియా ఇంజనీర్ కె. సోమశేఖరరావు,  ఎస్సీ (ఈ&ఎం) పి. సాయినాథ్, డివైస్ సి (ఈ&ఎం) బి. రాంబాబు, సేఫ్టీ ఆఫీసర్ (ఎలక్ట్రికల్ విభాగం) ఎ. ప్రదీప్ కుమార్, వెల్ఫేర్ ఆఫీసర్ కె. శ్రీనివాస్, ఏఐటీయూసీ,  ఐఎన్‌టీటీయూసీ పిట్  సెక్రెటరీలు డి. ప్రసాద్, ఇ. నగేష్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -