– అనుదినం – జనస్వరంతో ముందుకు
– సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్
నవతెలంగాణ-సత్తుపల్లి
ప్రజల కోసమే నవతెలంగాణ ఆవిర్భవించిందని, ప్రజా సమస్యల వెలికి తీస్తూ వాటి పరిష్కారం కోసం తన వంతు పాత్రను నవతెలంగాణ సమాజానికి అందిస్తోందని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ అన్నారు. నవతెలంగాణ దినపత్రిక 11వ వార్షికోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలుపుతూ పత్రిక గురించి ఆమెకు తెలిసిన విషయాలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. పత్రికా రంగంలో పోటీని తట్టుకుంటూ లాభాపేక్ష లేకుండా నవతెలంగాణ పత్రిక తన ప్రస్థానాన్ని ముందుకు తీసుకెళ్లడం అభినందనీయమన్నారు. ప్రజా గొంతుకగా, అనునిత్యం జనస్వరంతో అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు వారధిగా నిలుస్తూ సమాజంలో తన వంతు పాత్రను ‘నవతెలంగాణ’ నూటికి నూరు శాతం క్రియాశీలకంగా నిర్వహిస్తోందని కొనియాడారు. వార్షికోత్సవం సందర్భంగా ‘నవతెలంగాణ’ పత్రిక యాజమాన్యానికి ఎడిటోరియల్ సిబ్బందికి, పాత్రికేయులకు, పత్రిక నిర్వహణ బాధ్యులకు ఎమ్మెల్యే రాగమయి దయానంద్ శుభాకాంక్షలు తెలిపారు. మున్ముందు కూడా ‘నవతెలంగాణ’ తన పాత్రను సమాజ ఉద్ధరణకు ఉపయోగ పడేలా తన ప్రస్థానాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఎమ్మెల్యే రాగమయి దయానంద్ ఆకాంక్షించారు.
ప్రజల కోసమే నవతెలంగాణ ‘ఆవిర్భావం’
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



