నవతెలంగాణ – హైదరాబాద్
“ప్రజల అభిప్రాయాలకు అద్దం పడుతూ.. సమాజ చైతన్యానికి దిక్సూచిగా నిలుస్తూ ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించడంలో నవతెలంగాణ కీలక పాత్ర పోషిస్తోంది. ప్రజా సమస్యలపై గళం విప్పుతూ పాఠకుల విశ్వాసాన్ని చూరగొంటోంది. ఆ పత్రిక 11వ వార్షికోత్సవ నేపథ్యంలో నవతెలంగాణ పత్రికకు, యాజమాన్యానికి, సంపాదకవర్గానికి, పాత్రికేయులకు, సిబ్బందికి, పాఠకులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
సత్యనిష్ఠ, నిష్పాక్షికత, సామాజిక బాధ్యతతో కూడిన జర్నలిజాన్ని మరింత ఉన్నత ప్రమాణాలతో కొనసాగిస్తూ, ప్రజలకు విశ్వసనీయ సమాచారాన్ని అందించడంలో నవతెలంగాణ పత్రిక బాగా కృషి చేస్తోంది. అదే ఒరవడిని కొనసాగిస్తూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ వార్షికోత్సవం సంస్థకు నూతన ఉత్సాహాన్ని, ఆర్థికంగా పురోగతిని సాధిస్తూ పత్రికకు మరిన్ని విజయాలను తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.”
(భట్టి విక్రమార్క మల్లు)
తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి



