Saturday, August 1, 2026
E-PAPER
Homeతాజా వార్తలుభిన్న ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్

భిన్న ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్

- Advertisement -

ముగెన్ రావ్, ప్రీతి అస్రాని, తాన్యా హోప్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘నిరమ్. కె. స్క్వేర్ సినిమాస్ సమర్పణలో యూనిట్ ఆఫ్ కె స్క్వేర్ వెంచర్స్ బ్యానర్ పై కె. బిందుమాధవి నిర్మిస్తున్నారు. దర్శకుడు బలరామ్ కృష్ణ రూపొందిస్తున్న ఈ సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. శుక్రవారం ఈ సినిమా తెలుగు ట్రైలర్, ఆడియో లాంచ్ వేడుకను ఘనంగా నిర్వహించారు. మ్యూజిక్ డైరెక్టర్ డి. ఇమ్మాన్ మాట్లాడుతూ,'క్రైమ్ ఇన్విస్టిగేటివ్ థ్రిల్లర్స్, క్రైమ్ థ్రిల్లర్స్, హారర్..ఇవి నా ఫేవరేట్ జోనర్స్. నేను కెరీర్ లో ఇప్పటిదాకా 120కి పైగా చిత్రాలకు మ్యూజిక్ చేశాను. అయితే నేను కంపోజ్ చేసిన రెండో క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ ఇది. ఈ సినిమాలో నాలుగు సాంగ్స్ ఉంటాయి. భారతీబాబు, వనమాలి మంచి సాహి త్యాన్ని అందించారు అని తెలిపారు. ‘నేను, డైరెక్టర్ బలరామ్ కృష్ణ స్కూల్ ఫ్రెండ్స్. మా కె స్క్వేర్ వెంచర్స్ సంస్థకు ఇది తొలి చిత్రం. మేము ఈ సినిమా నుంచి సినిమా పరిశ్రమలో మా ప్రయాణం కొనసాగించాలని అనుకుంటున్నాం. మేము కొత్త వాళ్లమైనా మ్యూజిక్ డైరెక్టర్ ఇమ్మాన్ వెల్ కమ్ చేశారు. మాతో వర్క్ చేసేందుకు ముందు కొచ్చారు. డైరెక్టర్ బలరామ్ ఒక సరికొత్త ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ ను మీకు ప్రెజెంట్ చేయబోతున్నారుఅని కో ప్రొడ్యూసర్ పి. రాజేష్ చెప్పారు. డైరెక్టర్ బలరామ్ కృష్ణ మాట్లాడుతూ,'మీరు కొత్త వాళ్లను ఎంతోమందిని ఎంకరేజ్ చేస్తుంటారు. మీకు మా మూవీ నచ్చితే మనస్ఫూర్తిగా సపోర్ట్ చేయండి అని అన్నారు.
‘ట్రైలర్ లాగే సినిమా కూడా ఎంగేజ్ చేస్తుంది. తెలుగు ఆడియెన్స్ మా సినిమా చూసి ఆదరించాలని మేమంతా కోరుకుంటున్నాం` అని హీరో ముగెన్ రావ్ చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -