Saturday, August 1, 2026
E-PAPER
Homeతాజా వార్తలు'నేను రెడీ` ఘన విజయం ఖాయం : వి.వి.వినాయక్

‘నేను రెడీ` ఘన విజయం ఖాయం : వి.వి.వినాయక్

- Advertisement -

హవీష్ కథానాయకుడిగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘నేను రెడీ’. హార్నిక్స్ ఇండియా ఎల్.ఎల్.పి. బ్యానర్‌పై కోనేరు సత్యనారాయణ, నిఖిల కోనేరు నిర్మిస్తున్న ఈ చిత్రంలో కావ్యా థాపర్ కథానాయిక. తాజాగా ‘మెరుపులే మెరుపులేసాంగ్ లాంచ్ చేశారు. డైరెక్టర్ వివి వినాయక్ ఈ వేడుకకి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హీరో హవీష్ మాట్లాడుతూ,'ఇందులో మా ఫస్ట్ సాంగ్ బ్లాక్‌బస్టర్ హిట్ అయింది. అలాగే ఈ పాట కూడా మీకు నచ్చిందని భావిస్తున్నాను. మిక్కీ చాలా మంచి మ్యూజిక్ కంపోజ్ చేశారు. ఈ సినిమా చాలా బాగుంటుంది. మా ప్రొడ్యూసర్స్ ఇప్పటికే సినిమా చూసి చాలా హ్యాపీగా ఉన్నారు. ట్రైలర్‌లో ఏముంటుందో, దానికి వంద రెట్లు సినిమాలో ఉంటుంది. సినిమా అంతా నవ్వుతూనే ఉంటారు. చాలా మంచి కథతో కూడిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది అని తెలిపారు. ‘ఇక్కడి ఎనర్జీ చూస్తుంటే చాలా ఆనం దంగా ఉంది. కేఎల్ యూనివర్సిటీకి వస్తున్నప్పుడు నాకు రామోజీ ఫిల్మ్ సిటీకి వచ్చిన అనుభూతి కలిగింది. సత్యనారాయణని చూస్తుంటే రామోజీ రావుని చూసినట్లే అనిపించింది.

ఈ యూనివర్సిటీ ఎంత అద్భుతంగా ఉందో, సినిమా కూడా అంతే బాగుం టుందని నమ్ముతున్నాను. ఆయన తన కుమారుడి కోసం పెట్టుకున్న కలలన్నీ ఈ సినిమాతో నెరవేరాలని కోరుకుం టున్నాను. హవీష్ చాలా పెద్ద కమర్షి యల్ హీరో అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. త్రినాథరావు నక్కిన తీసిన ‘నేను లోకల్’, ‘సినిమా చూపిస్త మావ’ సినిమాలు నాకు చాలా ఇష్టం. ఆ సినిమాల సరసన ఈ సినిమా కూడా చేరాలని కోరుకుంటున్నానుఅని దర్శకుడు వి.వి. వినాయక్ అన్నారు. దర్శకుడు త్రినాథరావు నక్కిన మాట్లాడుతూ,'హవీష్ కి ఇది రీఎంట్రీ మూవీలా, కాలర్ ఎత్తుకునే సినిమా అవుతుంది. ఈ సినిమాలో యష్ మాస్ట ర్‌తో ఇంట్రడక్షన్ సాంగ్ చేయించాం. 'ధమాకా'లో రవితేజ పాట ఎంత పెద్ద హిట్ అయిందో, ఈ పాట కూడా అంత పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. మా నిర్మాతలు ప్రతిదీ అద్భుతంగా సమకూర్చారు అని అన్నారు.

మా తొలి ప్రొడక్షన్‌కు త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించడం చాలా సంతోషంగా ఉంది. ఆయన ఎప్పుడూ సూపర్ హిట్ సినిమాలే చేస్తారు. ఈ సినిమా వాటన్నింటి కంటే పెద్ద సూపర్ డూపర్ హిట్ అవుతుందనే నమ్మకం ఉంది. హవీష్‌ను ఆయన చాలా అద్భు తంగా చూపించారు. పాటలు సిని మాకి హైలెట్ అవుతాయి.
నిర్మాత నిఖిల కోనేరు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -