కార్తి హీరోగా తమిళ, తెలుగు భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ‘సర్దార్’కి సీక్వెల్ ‘సర్దార్ 2’తో ప్రేక్షకులు ముందుకు రానున్నారు. ప్రీక్వెల్‌కి దర్శకత్వం వహించిన పిఎస్ మిత్రన్ దీనికీ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రిన్స్ పిక్చర్స్, ఐవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ గ్రాండ్ గా నిర్మిస్తోంది. ఈ చిత్రంలో మాళవిక మోహన్, ఆషికా రంగనాథ్, రజిషా విజయన్ ఫిమేల్ లీడ్స్ గా నటిస్తుండగా, ఎస్ జె సూర్య ఓ పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తున్నారు. తాజాగా విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. ‘శాంతం… శాంతం… శాంతమే ప్రశాంతం… ఒక పొడుపు కథ చెబుతాను…అంటూ ఎస్.జే. సూర్య పవర్‌ఫుల్ వాయిస్‌తో టీజర్ ప్రారంభ మవుతుంది. 'ఇద్దరు గూఢచారులు... ఒకడు తండ్రి, ఒకడు కొడుకు... వాళ్ల టార్గెట్ నేనే. ఇప్పుడు గెలవబోయేది మంచి విలనా... చెడ్డ హీరోనా? అంటూ ఎస్.జే. సూర్య చెప్పే డైలాగ్స్ టీజర్‌కే హైలైట్‌గా నిలిచాయి. ఎస్.జే. సూర్య పాత్ర చుట్టూనే కథలో కాన్ఫ్లిక్ట్ ఉండబోతుందనే ఆసక్తిని మేకర్స్ క్రియేట్ చేశారు. కార్తి డబుల్ రోల్‌లో అదరగొట్టారు. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్‌లో ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ మెస్మరైజ్ చేస్తోంది. ఈ చిత్రం సెప్టెంబర్ 10న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది అని మేకర్స్ తెలిపారు.
ఇద్దరి టార్గెట్ నేనే..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



