Saturday, August 1, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం‘సీబీఎల్’ కార్మికులకురె గ్యులర్ పని దినాలు కల్పించాలి

‘సీబీఎల్’ కార్మికులకురె గ్యులర్ పని దినాలు కల్పించాలి

- Advertisement -

పరిశ్రమలో కాంట్రాక్ట్ కార్మికుల ఆందోళన
అర్ధాంతరంగా ఉత్పత్తి నిలిపేయడంతో రోడ్డున పడ్డ కార్మికులు : సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు

నవతెలంగాణ-చౌటకూర్
​‘సీబీఎల్’ పరిశ్రమలో కాంట్రాక్టు కార్మికులకు రెగ్యులర్ పని దినాలు కల్పించాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు అన్నారు. సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం శివంపేట గ్రామ పరిధిలోని సీబీఎల్ పరిశ్రమలో ఏడాదిగా సుమారు వందలాది మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారనీ, అర్ధాంతరంగా పరిశ్రమ యాజమాన్యం ఉత్పత్తులు నిలిపివేయడంతో వారంతా రోడ్డున పడ్డారన్నారు. శుక్రవారం పరిశ్రమ వద్ద కాంట్రాక్టు కార్మికులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా చుక్కరాములు ఆ ఆందోళనలో పాల్గొని మాట్లాడారు. జాతీయ రహదారి విస్తరణతో ఈ కంపెనీ ముందు సహజసిద్ధంగా వర్షపునీరు వెళ్ళే దారి మూసుకుపోయింద న్నారు. దీంతో వర్షం పడినప్పుడు కంపెనీ లోతట్టు ప్రాంతంగా మారి నేషనల్ హైవే పైనుండి వచ్చే వర్షపునీరు కంపెనీలోకి చేరుతోందన్నారు. కంపెనీలోకి వచ్చిన ఈ నీటిని మోటార్ల సాయంతో యాజమాన్యం బయటకు పంపుతోందని, కానీ దీన్ని కొంత మంది ఉద్దేశపూర్వకంగా కాలుష్యపు నీటిని నదిలో కలుపుతున్నారనీ ఫిర్యాదు చేయడంతో కాలుష్య నియంత్రణ మండలి అధికారులు పూర్తిస్థాయి విచారణ చేయకుండా షోకాజ్ నోటీస్ ఇచ్చారన్నారు. దీంతో యాజమాన్యం తాత్కాలికంగా ఉత్పత్తులను నిలిపేయడంతో కార్మికులకు పని లేకుండా పోయిందని తెలిపారు.

ఇప్పటికే కంపెనీలో సరైన ప్రొడక్షన్ లేక కాంట్రాక్ట్ కార్మికులకు నెలకు కేవలం 15 రోజులే పని దొరుకుతుందన్నారు. ఇప్పుడు ఆ పని కూడా పోవడంతో కంపెనీపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడ్డ సుమారు 2వేల మందికి ఉపాధి పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవంగా కంపెనీ యాజమాన్యం కాలుష్య కారక వ్యర్ధాలు బయటకు వదిలితే జిల్లా యంత్రాంగం చట్ట ప్రకారం కంపెనీపై చర్య తీసుకోవాలని, దానికి కార్మికుల బతుకుదెరువుకు ఎందుకు ఆటంకం కల్పిస్తారని ప్రశ్నించారు. ఇప్పటికే కంపెనీలో వ్యర్థ జలాలు శుద్ధి చేయడానికి అవసరమైన ట్రీట్మెంట్ చేసే పరికరాలను యాజమాన్యం ప్లాంట్లో సమకూర్చుకుని శుద్ధి చేస్తోందన్నారు. శుద్ధి చేసిన నీటిని కంపెనీ లోపల యంత్రాల క్లీనింగ్, గార్డెన్ కు, బాత్రూమ్‌లకు వాడుతున్నారని తెలిపారు. శుద్ధి కాని అనవసరమైన వ్యర్థ జలాలను ట్యాంకర్ల ద్వారా పటాన్‌చెరులోని ఈటీపీ ప్లాంట్ కు తరలిస్తున్నారని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించి న్యాయం చేయాలని డిమాండ్‌ ‌చేశారు. వర్షం నీరు కంపెనీలోకి రాకుండా బయటకు వెళ్ళడానికి అవసరమైన నేచురల్ డ్రయినేజీని పునరుద్ధరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ సంగారెడ్డి జిల్లా అధ్యకులు బి.మల్లేశం, జిల్లా ఉపాధ్యక్షులు, యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ పి.బాగారెడ్డి, ఎంప్లాయీస్ యూనియన్ జనరల్ సెక్రెటరీ ప్రసన్న రావు,
కాంట్రాక్టు కార్మికుల యూనియన్ జనరల్ సెక్రెటరీ సురేష్, ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు, కాంట్రాక్ట్ యూనియన్ నాయకులు, పర్మినెంట్ కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -