ఏటూరు నాగారంలోని రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
లోతట్టు ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు
నవతెలంగాణ-ఏటూరునాగారం ఐటీడీఏ
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరిలో వరద ఒక్కసారిగా ఉప్పొంగింది. వరద పోటెత్తడంతో ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద గోదావరి వరద ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల సమయానికి వరదనీరు 14.83 మీటర్లకు చేరుకోవడంతో ఇరిగేషన్ అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గుడిగంట బ్యారేజ్ వద్ద వరద ఎక్కువగా చేరడంతో అధికారులు అన్నిగేట్లను ఎత్తివేసినట్టు సమాచారం. అదేవిధంగా మహారాష్ట్ర నుంచి ఇంద్రావతి నదులు ఉప్పొంగి ప్రవహించడంతో గోదావరిలో వరద ప్రవాహం ఉధృతమవుతోంది. ఈ మేరకు దేవాదుల సమ్మక్కబ్యారేజ్ వద్ద కూడా అంచనాకు మించి ప్రవహించడంతో అధికారులు అన్నిగేట్లను ఎత్తివేశారు. రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద సాయంత్రం 4గంటల సమయానికి 17.130 మీటర్లకు చేరుకొని గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఈ మేరకు అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇంకా గోదావరిలో వరద ఉధృతంగా చేరే అవకాశం ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీస్, రెవెన్యూ , ఐటీడీఏ అధికారులు వరద ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు
.
పునరావాస కేంద్రాలకు ప్రజల తరలింపు
మండలంలోని గుమ్మడిదొడ్డి గ్రామానికి చెందిన ఐదు కుటుంబాల్లోని 20 మందిని స్థానిక ఎంపీపీఎస్‌లో, దూలాపురం నుంచి రెండు కుటుంబాల్లోని ఎనిమిది మందిని స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో, పెద్దగొల్లగూడెం రెండు కుటుంబాలను ఎంపీపీఎస్‌లో, సుందరయ్యకాలనీలో 20 కుటుంబాల్లోని 60 మందిని జగన్నాథపురంలోని పునరావాస కేంద్రాలకు తరలించారు. ప్రాంతాల్లో గర్భిణులు, చిన్నపిల్లలు, వృద్ధులు అత్యవసర వైద్య సేవలు అవసరమైన వారికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ వరద నీటిలోకి వెళ్లకుండా, అధికారుల సూచనలు పాటించాలని కోరారు.
వరదల్లో గర్భిణిని
సురక్షితంగా తరలించిన ఎన్డీఆర్ఎఫ్గోదావరి నది వరదల కారణంగా రాకపోకలు నిలిచిపోయిన నేపథ్యంలో అయ్యవారిపేట గ్రామ పంచాయతీలో ప్రసవ వేదనతో బాధపడుతున్న ఓ గర్భిణిని ఎన్డీఆర్ఎఫ్ బృందం పడవ ద్వారా వాజేడులోని సురక్షిత ప్రాంతానికి తరలించింది. వరద నీటి కారణంగా రోడ్డు మార్గం పూర్తిగా తెగిపోవడంతో గర్భిణికి అత్యవసర వైద్య సేవలు అందించేందుకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రత్యేక పడవలో నదిని దాటించారు. అనంతరం ఆమెను 108 అంబులెన్స్ ద్వారా ఏటూరునాగారం సమీప ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, వరద ప్రభావిత
లోతట్టు ప్రాంతాలు జలమయం
వాజేడు : వాజేడు మండలంలో గోదావరి ఉధృతంగా పెరిగి నీటిమట్టం 20 మీటర్లకు చేరుకుంది. దీంతో వరద ముంపుతో మండలంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మండలంలో పలు గ్రామాలకు వెళ్లే రోడ్డు మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. వాజేడు నుంచి గుమ్మడిదొడ్డి, పూసూరు నుంచి జడ్చర్లపల్లి రోడ్డు మార్గాలు నీటమునిగాయి.



