Sunday, August 2, 2026
E-PAPER
Homeతాజా వార్తలుపక్కా కామెడీ ఎంటర్‌టైనర్‌

పక్కా కామెడీ ఎంటర్‌టైనర్‌

- Advertisement -

హీరో వరుణ్ తేజ్ సరికొత్త అవతార్‌లో కనిపిస్తున్న ‘కొరియన్ కనకరాజు’ పై రోజురోజుకీ అంచనాలు పెరుగుతున్నాయి. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హారర్ కామెడీని యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌ మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తాజాగా హీరో రామ్ చరణ్ ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేసి అంచనాలను మరింత పెంచేశారు.
హీరో వరుణ్ తేజ్ మాట్లాడుతూ,’ట్రైలర్ మీ అందరికీ నచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఒక మంచి కామెడీ ఎంటర్‌టైనర్‌తో మిమ్మల్ని అలరించాలని ఈ సినిమా చేశాం. ఈనెల 7న థియేటర్లలో ఈ సినిమాను ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నాను. ఇందులో నేను రెండు పర్సనాలిటీస్‌లో కనిపిస్తాను. ఇది పూర్తి స్థాయి కామెడీ ఎంటర్‌టైనర్. ఒకే బాడీలో రెండు ఆత్మలు ఉంటే ఎలాంటి ఛాలెంజెస్ వుంటాయి. పెర్ఫార్మెన్స్‌కు మంచి స్కోప్ ఉన్న పాత్ర దొరికింది. డైరెక్టర్ రాసుకున్న పాత్రకు పూర్తి న్యాయం చేయడానికి ప్రయత్నించాను. ఈ సినిమా చేయడం నటుడిగా నాకు చాలా సంతృప్తిని ఇచ్చిందిఅని తెలిపారు. 'నేను చేసిన ప్రతి సినిమాకు తెలుగు ప్రేక్షకులు ఎంతో ప్రేమ చూపించారు. ఈ సినిమాలో నేను చేసిన చైత్ర పాత్ర కూడా మీ అందరికీ నచ్చుతుంది అని రీతికా నాయక్ చెప్పారు. దర్శకుడు మేర్లపాక గాంధీ మాట్లాడుతూ,’ సినిమాలో ఇంకా ఎక్కువ ఫన్, కామెడీ ఉంటుంది. మనోజ్ అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. థమన్ అద్భుతమైన రీ-రికార్డింగ్ అందిస్తున్నారుఅని అన్నారు. డీఓపీ మనోజ్ మాట్లాడుతూ,'అనంతపురం, కొరియాను చాలా అందంగా, అద్భుతంగా ప్రజెంట్ చేశాం. ఇది చాలా మంచి కథ. తప్పకుండా మీరు థియేటర్‌లో సినిమా చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -